పెద్దవంగర, (ఆంధ్రప్రభ ): మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర పోలీస్ స్టేషన్ లోని పైన విశ్రాంతి గదిలో బయట వ్యక్తులతో కలిసి కానిస్టేబుళ్లు దావత్ చేసుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.. దీనిని సీరియస్ గా తీసుకున్న మహబూబాబాద్ జిల్లా ఎస్పీ సుధీర్ రాంనాథ్ కేకన్ దీనిపై విచారణ జరిపి నివేదికను మల్టీ జోన్ ఐ. జి చంద్రశేఖర్ రెడ్డి కి పంపారు.. దీనిని పరిశీలించిన ఆయన హెడ్ కానిస్టేబుల్ రాజారామ్ ,కానిస్టేబుల్ సుధాకర్ ను క్రమశిక్షణ చర్యల్లో భాగంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
Mahabubabad | పోలీస్ స్టేషన్ లో దావత్… కానిస్టేబుళ్ల సస్పెన్షన్
