MLA Gandra | అభివృద్ధి పనులకు శంకుస్థాపన

MLA Gandra | అభివృద్ధి పనులకు శంకుస్థాపన

  • మున్సిపల్ ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించాలి
  • భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు

MLA Gandra | ఆంధ్రపభ ప్రతినిధి, భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపాలిటీలో పెరుగుతున్న జనాభాకు అణుగుణంగా మౌలిక వసతుల కల్పనకు కోట్లాది రూపాయల నిధులు వెచ్చిస్తు అభివృద్ధి పనులు చేస్తున్నట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. ఈ రోజు భూపాలపల్లి మున్సిపాలిటీలోని 9,10 వ వార్డులో వివిధ అభివృద్ధి పనులకు ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి , డీసీసీ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్ లతో కలిసి శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ మున్సిపాలిటీల అభివృద్ధి లక్ష్యంగా సీఎం రేవంత్ రెడ్డి కృషి చేస్తున్నారన్నారు. సీఎం సహకారంతో ప్రత్యేక నిధులు తీసుకువచ్చి భూపాలపల్లి మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేపడుతున్నామన్నారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో 30వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు అఖండ మెజారిటీ ఇచ్చి గెలిపించి ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.

9,10 వార్డు లలో రూ. 50 లక్షలతో ముదిరాజ్ కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశామన్నారు. మంజూరు నగర్లో రూ. 1కోటితో స్మశాన వాటిక , 9వ వార్డులో రూ.50 లక్షలతో స్మశాన వాటిక , పెద్దమ్మతల్లి, హనుమాన్, లక్ష్మి దేవర ఆలయాలకు ఎదురు మంజూరు చేశామన్నారు. బీటీ రోడ్డు పనులు కూడా మొదలుపెట్టామన్నారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ మిగులు పనులకు రూ.6కోట్లు కేటాయించడం జరిగిందన్నారు.

పుల్లురీ రామయ్య పల్లి వేషాలపల్లి మధ్యలో రూ. 2కోట్లతో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేశామన్నారు. తుమ్మల చెరువు ఇప్పటికే 3 కోట్ల 14 లక్షల పెట్టీ రింగు ట్యాంక్ బండ్ అభివృద్ధి పనులు చేపట్టామని మరో రూ.1కోటి తో కట్టపై ఇరువైపుల సీసీ రోడ్డు, లైటింగ్, సీసీ కెమెరాలకు నిధులు మంజూరు చేశామన్నారు. 9వ వార్డులో రూ.26 కోట్లతో నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు.

ఈ ప్రాంత ప్రజలకు తాగునీటి సౌకర్యం కోసం 32లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంక్ నిర్మాణం చేపట్టామన్నారు. జిల్లా జనరల్ ఆస్పత్రిలో 100 బెడ్లను 300 బెడ్లకు అప్గ్రేడ్ చేశామన్నారు. సిటీ స్కాన్ ప్రారంభించాం, త్వరలో ఏం ఆర్ ఐ కూడా ప్రారంభిస్తాం అని తెలిపారు. ప్రతి వార్డుకు ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ విజయలక్ష్మి, మున్సిపల్ కమిషనర్ జోన, టౌన్ అధ్యక్షుడు దేవన్, నాయకులు బుర్ర కొమురయ్య, అప్పం కిషన్, దాట్ల శ్రీనివాస్, సిరుప అనిల్, రవీందర్ మాధవరావు, వివిధ శాఖల అధికారులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply