Salaar 2 | పట్టాలెక్కేది ఎప్పుడు..?

Salaar 2 | పట్టాలెక్కేది ఎప్పుడు..?
Salaar 2 | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ సలార్. సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీలో ప్రభాస్ పవర్ ఫుల్ గా, మాస్ గా కనిపించడంతో.. ఎప్పుడెప్పుడు సలార్ 2 సెట్స్ పైకి వస్తుందా అని డార్లింగ్ ఫ్యాన్స్ (Darling Fans) ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే.. మేకర్స్ నుంచి అఫిషియల్ గా ఎలాంటి అప్ డేట్ రాలేదు. నిన్న కల్కి 2 గురించి వార్తలు వస్తే.. నేడు సలార్ 2 గురించి వార్తలు రావడం ఆసక్తిగా మారింది. ఇంతకీ.. సలార్ 2 సెట్స్ పైకి వచ్చేది ఎప్పుడు..?
Salaar 2 | ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్..
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్, యూనివర్శిల్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ బ్యూటీ దీపికా పడుకునే.. ప్రధాన పాత్రలు పోషించడంతో కల్కి మూవీ పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ అంచనాలకు తగ్గట్టే కల్కి సినిమా 1000 కోట్లకు పైగా కలెక్ట్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ (Boxoffice) దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసింది. దీంతో కల్కి 2 ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని ప్రభాస్ అభిమానులే కాదు.. సినీ అభిమానులు కూడా ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఫిబ్రవరి నుంచి కల్కి 2 షూటింగ్ స్టార్ట్ కానుందని.. మార్చి నుంచి ప్రభాస్ కల్కి 2 షూటింగ్ లో జాయిన్ అవుతారని వార్తలు వచ్చాయి.

Salaar 2 | జనవరి 26న సలార్2 షూటింగ్..
ఇప్పుడు సలార్ 2 గురించి వార్తలు వస్తుండడం విశేషం. ఈ సినిమాలో ప్రభాస్ ని అభిమానులు ఎలా చూడాలి అనుకుంటున్నారో అలా చూపించడంతో.. ఎప్పుడెప్పుడు సలార్ 2 (Salar2) వస్తుందా అని ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. జనవరి 25 లేదా జనవరి 26న సలార్2 షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్ రానుందని టాక్ వినిపిస్తోంది. అయితే.. మేకర్స్ నుంచి అఫిషియల్ గా ఎలాంటి అనౌన్స్ మెంట్ లేదు కానీ.. ఈ న్యూస్ తో డార్లింగ్ ఫ్యాన్స్ ఎగ్జైట్ అవుతున్నారు. ప్రశాంత్ నీల్ ప్రస్తుతం ఎన్టీఆర్ తో డ్రాగన్ మూవీ షూటింగ్ బిజీలో ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి ఆతర్వాత సలార్ 2 షూటింగ్ స్టార్ట్ చేస్తారు. మరి.. ప్రచారంలో ఉన్నట్టుగా జనవరి 25 లేదా 26న సలార్ 2 అప్ డేట్ ఇస్తారేమో చూడాలి.

