Highway | బాబోయ్‌.. ఇదేం ట్రాఫిక్

Highway | బాబోయ్‌.. ఇదేం ట్రాఫిక్

  • విజ‌య‌వాడ‌, హైద‌రాబాద్ హైవేపై ఫుల్ ట్రాఫిక్‌..
  • దారి మ‌ళ్లిస్తున్న ట్రాఫిక్ పోలీసులు

Highway | వెబ్‌డెస్క్ , ఆంధ్ర‌ప్ర‌భ : సంక్రాంతి పండుగ సెలవులు ముగియడంతో జ‌నం ప‌ల్లెల నుంచి పట్నం బాటపట్టారు. సొంతూళ్ల నుంచి న‌గ‌రానికి తిరిగి ప‌య‌న‌మ‌య్యారు. కారణంగా హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై (Road) భారీ రద్దీ నెలకొంది. ఈరోజు కూడా యాదాద్రి భువనగిరి జిల్లాలోని చౌటుప్పల్ మండలం పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు కిలోమీటర్ల మేర బారులు తీరి నెమ్మదిగా కదులుతున్నాయి. ఏపీలోని ప్రధాన పట్టణాల నుంచి వాహనాలు అధికంగా వ‌స్తుండ‌టంతో చిట్యాల, పెద్దకాపర్తి ప్రాంతాల్లో రద్దీ మరింత ఎక్కువైంది.

పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు వాహనాలను దారి మళ్లిస్తూ ట్రాఫిక్ (Trafic) నియంత్రణ చర్యలు చేపట్టారు. గుంటూరు నుంచి వచ్చే వాహనాలను మిర్యాలగూడ–హాలియా–చింతపల్లి–మాల్ మార్గంలోకి, విజయవాడ నుంచి వచ్చే హెవీ వాహనాలను కోడాడ్–మాల్ మార్గంలోకి మళ్లిస్తున్నారు. చిట్యాల వద్ద ట్రాఫిక్ ఎక్కువైతే భువనగిరి, రామన్నపేట మార్గాన్ని ఉపయోగించాలంటున్నారు. పంతంగి టోల్ ప్లాజాలో అదనపు లేన్‌లు తెరిచి మొత్తం 11 బూత్‌ల ద్వారా వాహనాల రాకపోకలను వేగవంతం చేస్తుండగా.. డ్రోన్‌లు, సీసీటీవీలతో పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు.

CLICK HERE TO READ  నో పాలిటిక్స్‌.. ఓన్లీ అభిమానం

CLICK HERE TO READ MORE

Leave a Reply