TG | విబిజి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని

TG | విబిజి రాంజీ పథకాన్ని రద్దు చేయాలని
- తీర్మానాలు చేయాలి
- గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలి
- ప్రభుత్వ పథకాలఫై ప్రచారం చేయాలి
- అసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణక్క
TG | జైనూర్, ఆంధ్రప్రభ : గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేసే విధంగా గ్రామ సమస్యలు పరిష్కరించే విధంగా నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, నాయకులు కృషి చేయడంతో పాటు కేంద్ర ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన విబిజి రాంజీ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేయాలని మాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కొనసాగించాలని పంచాయతీల వారీగా తీర్మానాలు చేయాలని ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షురాలు అత్రం సుగుణక్క కోరారు.

ఇవాళ కొమురం భీం అసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని బుచ్చిరం టీచర్ ఫంక్షన్ హాల్ లో జైనూర్, సిర్పూర్ (యు) మండలాలకు చెందిన నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ… గ్రామాల అభివృద్ధికి నూతన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు కృషి చేయాలని, ఏ సమస్యలున్నా తన దృష్టికి తేవాలని ఆమె కోరారు. పంచాయతీల అభివృద్ధికి ప్రభుత్వపరంగా నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తానని ఆమె పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజాపాలన ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులైన వారికి అందే విధంగా సర్పంచులు నాయకులు కృషి చేయాలని ఆమె కోరారు.
అనంతరం రెండు మండలాల కాంగ్రెస్ పార్టీ నుండి బలపరిచి గెలిచిన సర్పంచులకు, ఉప సర్పంచులకు శాలువాలతో సన్మానం చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం విబిజీ రాంజీ పథకం రద్దు చేస్తూ మహాత్మగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేయాలని ప్రచురించిన పత్రాలను విడుదల చేశారు.
ఈసమావేశంలో జైనూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుడి మేత విశ్వనాత్ రావు, ఆత్మ చైర్మన్ రాథోడ్ రమేష్, జైనూర్, సిర్పూర్ (యు) కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు అబ్దుల్ ముఖిద్, ఆత్రం గోవిందరావు, జైనూర్ మాజీ వైస్ ఎంపీపీలు చిర్లే లక్ష్మణ్ యాదవ్, రసీద్, రెండు మండలాల కాంగ్రెస్ పార్టీ నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
