Bhupalpally | భారత గడ్డపై సీపీఐ వందేళ్ళ ముగింపు వేడుకలు

Bhupalpally | భారత గడ్డపై సీపీఐ వందేళ్ళ ముగింపు వేడుకలు

  • ఖమ్మం తరలివెళ్లిన సీపీఐ పార్టీ శ్రేణులు

Bhupalpally | భూపాలపల్లి, ఆంధ్రప్రభ : ఖమ్మంలో జరిగే సీపీఐ 100 సంవత్సరాల ముగింపు వేడుకలకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా సీపీఐ జిల్లా పార్టీ నుండి పార్టీ శ్రేణులు ఇవాళ‌ భారీగా తరలివెళ్లారు. సీపీఐ జిల్లా కార్యదర్శి కోరిమి రాజ్ కుమార్ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. సీపీఐ వందేళ్ల వేడుకలకు జిల్లా నుండి 14 బస్సులతో సుమారు వెయ్యి మంది పార్టీ శ్రేణులు, ఏఐటీయూసీ కార్మికవర్గం పెద్ద ఎత్తున తరలివెళ్లారు.

భారతగడ్డపై మొట్టమొదటిసారి ఖమ్మం పట్టణంలో నిర్వహిస్తున్న సీపీఐ దశాబ్ది ఉత్సవాల ముగింపు సభ అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా 12మండలాల నుండి భూపాలపల్లి పట్టణ కేంద్రంలో సీపీఐ నాయకులు ఖమ్మంకు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి గురిజేపల్లి సుధాకర్ రెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు మోట పలుకుల రమేష్, సోతుకు ప్రవీణ్ కుమార్, క్యాతరాజ్ సతీష్, కొరిమి సుగుణ, మాతంగి రామచందర్, ఎండి ఆసిఫ్ పాషా, వేముల శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply