Nagarkurnool | పురపాలక చైర్మన్ల ఎంపికలో బీసీలకు పెద్దపీట

Nagarkurnool | పురపాలక చైర్మన్ల ఎంపికలో బీసీలకు పెద్దపీట
- 2 మున్సిపాలిటీలు బీసీ మహిళలకు
- కల్వకుర్తి మున్సిపల్ జనరల్ మహిళకు
- ఒక మున్సిపాలిటీ బీసీ జర్నల్ కు
- నాలుగు మున్సిపాలిటీలలో మూడు బీసీలకే
- ఓసీలకు నిరాశ
Nagarkurnool | నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి, ఆంధ్రప్రభ : నాగర్ కర్నూల్ జిల్లాలో ఉన్న మూడు పురపాలక మున్సిపాలిటీలు బీసీలకే చైర్మన్ గా దక్కాయి. ప్రభుత్వం ప్రకటించిన రిజర్వేషన్లలో నాగర్ కర్నూల్ జిల్లాలో బీసీలకు మొత్తంగా పెద్దపీట వేశాయి. నాలుగు మున్సిపాలిటీలు నాగర్ కర్నూల్, కొల్లాపూర్, అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గ కేంద్రాల్లో మున్సిపాలిటీలున్నాయి. ఈ నాలుగు మున్సిపాలిటీలు బీసీలకే దక్కాయి.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ బీసీ జనరల్ కాగా, కల్వకుర్తి మున్సిపాలిటీ జనరల్ మహిళ మున్సిపల్ చైర్మన్ గా ఎంపిక జరిగింది. అచ్చంపేట మున్సిపాలిటీ చైర్మన్ గా బీసీ మహిళకు కేటాయించారు. కల్వకుర్తి మున్సిపాలిటీ చైర్మన్ రిజర్వేషన్ జర్నల్ మహిళకు కేటాయించారు. కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎంపిక బీసీ మహిళకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నాలుగు మున్సిపాలిటీలు మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రభుత్వం బీసీలకు రిజర్వేషన్లలో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలుస్తోంది.
నాగర్ కర్నూల్ మున్సిపాలిటీ మొదటి నుండి బీసీలే కైవసం చేసుకుంటున్నారు. కొల్లాపూర్ మున్సిపాలిటీకి బీసీ మహిళ చైర్మన్ గా కొనసాగారు. కల్వకుర్తి మాత్రం మున్సిపాలిటీ జనరల్ వ్యక్తులు చైర్మన్ గా కొనసాగారు. అచ్చంపేట మున్సిపల్ చైర్మన్ గా జనరల్ ఓసి కొనసాగుతున్నారు, ఈ విధంగా చూస్తే గతంలో భిన్నంగా ఉండగా, ఈ పర్యాయం మొత్తంగా బీసీలకే దక్కడం బీసీలకు ఆశాజనకంగా ఉండగా, ఓసీలకు నిరాశని మిగిలింది. ఎన్నికలు వస్తాయన్నప్పటి నుండి రాజకీయ వారసులుగా ఓసీలు రావాలని ఎదురుచూస్తుండగా అనూహ్యంగా బీసీలకు రావడంతో అగ్రకులాలు, మైనార్టీలు తమకు చైర్మన్ గా అయ్యే అవకాశాలు లేకుండా అయ్యాయనే చర్చ కూడా కొనసాగుతున్నది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రభుత్వం బీసీలకు పెద్దపీట వేసింది.
