AP | పూర్వ వైభవం సంతరించుకున్న వేమన ఆలయం

AP | పూర్వ వైభవం సంతరించుకున్న వేమన ఆలయం

  • ఆహ్లా దకరాన్ని పంచుతున్న ఆలయం
  • పూర్తికావస్తున్న అభివృద్ధి పనులు
  • ఘనంగా వేమన జయంతి ఉత్సవాలు

AP | గాండ్లపెంట, ఆంధ్రప్రభ : గతంలో రాష్ట్ర పర్యాటక శాఖతో రూపుదిద్దుకున్న వేమన ఆలయం నేడు తిరిగి పూర్వ వైభవం సంతరించుకుంటోంది. సోమవారం వేమన జయంతి ఉత్సవాలను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ చొరవ తీసుకొని ఇక్కడ గత కొన్నేళ్లుగా కళావిహీనంగా మారిన వేమన ఆలయం, విడిది గదులు, రెస్టారెంట్, మరుగుదొడ్లు, పార్కు వాటి అన్నింటిని బాగు చేయించారు. ముఖ్యంగా ఇక్కడ అద్వాన స్థితికి చేరుకున్న ఆలయ పరిసరాలను శుభ్రం చేయించారు. అంతేకాకుండా గతంలో టూరిజం శాఖ వారు చేపట్టిన భవనాలన్నింటిని తిరిగి పునరుద్ధరణ చేయించి సుందరీకరణ చేయించారు.

అలాగే వేమన విహారం ఎదుట పచ్చని మొక్కలు, పార్కులో పచ్చని గడ్డిని ఏర్పాటు చేశారు. దీంతో వేమన ఆలయం చక్కటి ఆహ్లాదకరాన్ని పంచుతోంది. అలాగే వేమన ఆలయానికి రంగులు దిద్దారు. గత వారం రోజులుగా వేమన ఆలయ అభివృద్ధి పనులను కదిరి మున్సిపల్ కమిషనర్ కిరణ్ కుమార్, రాకేష్ పర్యవేక్షణలో చురుగ్గా సాగుతున్నాయి. అంతేకాకుండా పారిశుధ్యం నిర్మూలనకు తహసిల్దార్ బాబురావు, ఎంపీడీవో రామకృష్ణ పర్యవేక్షణలో కార్మికులు వారం రోజులుగా శ్రమిస్తున్నారు. అంతేకాకుండా సోమవారం వేమన జయంతి ఉత్సవాలకు వచ్చే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదన్న ఉద్దేశంతో వాహనాల కోసం ప్రత్యేక పార్కింగ్ తదితర ఏర్పాట్లు ను కదిరి డి.ఎస్.పి శివ నారాయణ స్వామి పర్యవేక్షణలో రూరల్ సీఐ నాగేంద్ర, స్థానిక ఎస్ఐ సుమతి లు చేపడుతున్నారు.

Leave a Reply