Controversy | ఫ్లెక్సీలు, బ్యానర్ల వివాదం

Controversy | ఫ్లెక్సీలు, బ్యానర్ల వివాదం

  • చంద్రగిరిలో ఉద్రిక్తత

Controversy | తిరుపతి రూరల్, ఆంధ్రప్రభ : తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలోని పుల్లయ్యగారి పల్లిలో జల్లికట్టు నిర్వహిస్తున్న వైసీపీ అభిమాని బొమ్మగుంట రవిని పోలీసులు అరెస్ట్ చేయడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాజీ సీఎం వైఎస్ జగన్ ఫ్లెక్సీలు, బ్యానర్లు తీసేయాలని పోలీసుల సూచించారు.

అయితే ససేమివా అన్న వైసీపీ శ్రేణులు గ్రామంలో అన్ని బ్యానర్లు తొలగిస్తే తాము కూడా తొలగిస్తామని భీష్మించి కూర్చున్నారు. దీంతో జల్లికట్టు నిర్వహిస్తున్న బొమ్మగుంట రవిని అరెస్టు చేసి చంద్రగిరి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

దీంతో కోపోద్రిక్తులైన వైసీపీ శ్రేణులు పోలీస్ స్టేషన్ చేరుకుని ధర్నానిర్వహించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తనయుడు చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి పోలీస్ స్టేషన్ చేరుకున్నాడు. వైసీపీ శ్రేణులతో కలిసి పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఒక దశలో పోలీసులకు, ఆందోళనకారులకు మధ్య వాగ్వావాదం చోటుచేసుకుంది. అరెస్టు చేసిన బొమ్మగుంట రవిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Leave a Reply