JAGITAL| అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు

JAGITAL| అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గం ఏర్పాటు
JAGITAL| జగిత్యాల, ఆంధ్రప్రభ : ఎండపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. సంఘం అధ్యక్షుడిగా మంతెన చంద్రయ్య, ఉపాధ్యక్షుడిగా మంతెన బ్రహ్మ, ప్రధాన కార్యదర్శిగా రేగుంట రమేష్‌ను ఎన్నుకున్నారు. ప్రచార కార్యదర్శిగా చెన్న హనుమయ్యను నియమించారు. క్యాషియర్‌గా కనుకుట్ల ప్రశాంత్‌కుమార్ శ్రీనివాస్ వ్యవహరిస్తారు. కార్యవర్గ సభ్యులుగా మంతెన చంద్రు, గాజుల వివేక్, బెక్కె శ్రీకాంత్, మంతెన అనిల్ ఎంపికయ్యారు. గ్రామాభివృద్ధి, యువజన సంక్షేమంతో పాటు గ్రామంలో డా. బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు కోసం కూడా సంఘం కృషి చేస్తుందని నూతన నాయకులు తెలిపారు.
