Narayanpeta | అయ్యప్ప నామస్మరణతో పులకించిన శబరిపీఠం

Narayanpeta | అయ్యప్ప నామస్మరణతో పులకించిన శబరిపీఠం
Narayanpeta | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలోని శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం శక్తిపీఠం వద్ద అయ్యప్ప స్వాములు, భక్తులు మకర జ్యోతిని పురస్కరించుకొని ఇవాళ శ్రీ అయ్యప్ప స్వామి విగ్రహానికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎంతో నియమనిష్టలతో కఠోర దీక్షలు చేపట్టిన అయ్యప్ప స్వాములు శబరి కొండ దివ్య దర్శనం కోసం తరలివెళ్లగా, మరి కొంతమంది దర్శనం చేసుకుని తిరిగి రావడంతో శక్తి పీఠం వద్ద ప్రత్యేక పూజలు తీర్థ ప్రసాదాల వితరణ చేపట్టారు.
ఈసందర్భంగా భక్తులు శ్రీ అయ్యప్ప భక్తి గీతాలు ఆలపించడంతో శక్తిపీఠం అయ్యప్ప నామస్మరణతో పులకించింది. అయ్యప్ప స్వామి మకర జ్యోతి దర్శనం దివ్యంగా జరగాలని పలువురు భక్తులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భక్తులు నర్సింలు, వెంకట్ రాములు, తమ్మి రెడ్డి, బాలాంజనేయులు, తదితరులు పాల్గొన్నారు.
