ప్రచారం నిర్వహిస్తున్న రావు పద్మ, బెజ్జంకి పూర్ణ చారి

ప్రచారం నిర్వహిస్తున్న రావు పద్మ, బెజ్జంకి పూర్ణ చారి
9వ వార్డు బిజెపి అభ్యర్థిని గెలిపించండి..
బిజెపి జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ ప్రచారం
పరకాల, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ): భారతీయ జనతా పార్టీ హనుమకొండ జిల్లా మాజీ అధ్యక్షురాలు రావు పద్మ పరకాల పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. పరకాల పురపాలక సంఘం 9వ వార్డు లో బిజెపి పార్టీ బలపరిచిన బెజ్జంకి పూర్ణాచారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని రావు పద్మ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం రోజు ప్రచారంలో భాగంగా ఆర్టీసీ డిపో సర్కిల్ లో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం 9వ వార్డులోని ఓటర్లను కలుస్తూ 9వ వార్డు బిజెపి అభ్యర్థి బెజ్జంకి పూర్ణ చారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సంక్షేమ పథకాలు బిజెపి అభ్యర్థులను గెలిపిస్తాయని అన్నారు. 9వ వార్డు అభివృద్ధి కోసం బెజ్జంకి పూర్ణ చారిని ఓటర్లు ఆదరించాలని రావు పద్మ ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో బిజెపి పార్టీ జిల్లా నాయకులు, నాయకురాళ్లు, పట్టణ బిజెపి నాయకులు, నాయకురాళ్లు పాల్గొన్నారు.
