మోడీ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి

మోడీ సంక్షేమ పథకాలే నన్ను గెలిపిస్తాయి

  • 9వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి క్యాట్ అశోక్

షాద్ నగర్, ఆంధ్రప్రభ : ఫిబ్రవరి 5 ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశంలో చేస్తున్న సంక్షేమ పథకాలే తమకు పునాదులని తమను గెలిపిస్తాయని 9వ వార్డు బిజెపిఅభ్యర్థి ప్యాట అశోక్ అన్నారు నేను మీ వాన్ని ఎల్లప్పుడూ మీకు అందుబాటులో ఉంటానని బిజెపి అభ్యర్థిగా మీ ముందుకు వచ్చాను కమలం గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని 9వ వార్డు అభ్యర్థి డేటా అశోక్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఎన్నికల ప్రచారంలో భాగంగా 9 వార్డులో ప్రజలను కాలనీలో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు.

ఇక్కడ డ్రైనేజీలు సిసి రోడ్లు విద్యుత్ తదితర మౌలిక సదుపాయాలు పూర్తిగా లేవని ఆయన దృష్టికి తీసుకొచ్చారు తాను కౌన్సిలర్ అయ్యాక కాలనీలోని అన్ని సమస్యలను పరిష్కారం చేసి మీ ఇంటి మనిషిగా ఉంటానని అన్నారు తొమ్మిదో వార్డును అంగంగా సిద్ధంగా తీర్చిదిద్దే బాధ్యత నాదని అన్నారు ప్రజలు ఆదరించి కమలం పువ్వుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన ఓటర్లను కోరారు ఈ ప్రచారంలో ఇస్నాతి శ్రీను, అల్లం అనిల్ కుమార్ గౌడ్, గంగాధర్ ఇస్నాతి , సంజీవ రెడ్డి, రమేష్ గౌడ్, చంద్రశేఖర్ రెడ్డి, మనోహర్, పుట్నాల సాయికుమార్, రవి, అంజి, వివేక్, అభిలాష్, త‌దిత‌రులున్నారు.

Leave a Reply