గ్రామసభలు నిర్వహణకు సిద్ధం కావాలి

గ్రామసభలు నిర్వహణకు సిద్ధం కావాలి

  • భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి, ఆంధ్రప్రభ ప్రతినిధి : 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన అన్ని గ్రామ పంచాయతీలలో గ్రామసభలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సమగ్ర ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి కార్యాలయంలో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ, ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పురోగతిని గ్రామసభల ద్వారా ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని పేర్కొన్నారు.

గ్రామసభల్లో లబ్ధి పొందిన లబ్ధిదారుల వివరాలను పారదర్శకంగా ప్రదర్శించాలని సూచించారు. గ్రామసభల నిర్వహణకు ముందుగానే షెడ్యూల్ సిద్ధం చేసి, పంచాయతీ కార్యదర్శులకు సమాచారం అందించాలన్నారు. అలాగే ప్రతి గ్రామంలో ప్రభుత్వం ద్వారా లబ్ధి పొందిన లబ్ధిదారుల జాబితాను గ్రామసభలో చదివి వినిపించాలని అధికారులకు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మయాంక్ సింగ్, అదనపు కలెక్టర్లు అశోక్ కుమార్, విజయలక్ష్మి, ఆర్డిఓ హరికృష్ణ, పంచాయతీ అధికారి శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply