ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యం…

ప్రభుత్వ నిధులతో గ్రామాల అభివృద్ధి సాధ్యం…
ఊట్కూర్, ఆంధ్రప్రభ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మంజూరు చేస్తున్న నిధులు సద్వినియోగం చేసుకుంటే గ్రామాలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతాయని ఊట్కూర్ ఇంచార్జి ఎంపీడీవో కొండన్న అన్నారు. శనివారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల పరిధిలోని పెద్దపోర్ల గ్రామ సర్పంచ్ బోయిన్ పల్లి కాశమ్మ తో కలిసి ఎంపీ నిధులతో సిసి రోడ్డు పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై గ్రామాభివృద్ధికి కృషి చేయాలన్నారు.
బిజెపి మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం. భాస్కర్, పెద్దపోర్ల సర్పంచ్ కాశమ్మ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ ఎంపీ నిధులతో గ్రామాలు అభివృద్ధి చేస్తామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ సంక్షేమపథకాలు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతో వేసవిలో ప్రజలు ఇబ్బందులు పడకుండా మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేస్తున్నారని అన్నారు.
ఎంపీ నిధులతో గ్రామాల్లో సిసి రోడ్లు డ్రైనేజీలు ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేశామని రానున్న రోజుల్లో మరిన్ని నిధులు తీసుకొచ్చి ప్రతి పల్లెను అభివృద్ధి చేస్తామన్నారు. ఎంపీ డీకే అరుణ సహకారంతో నిధుల వరద తీసుకోవచ్చి ప్రతి పల్లె రూపురేఖలు మారుస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఊట్కూర్ సర్పంచ్ రేణుక భరత్, పెద్దపొర్ల గ్రామ ఉపసర్పంచ్ కొల్లూరు మాధవి, ఊట్కూర్ ఉపసర్పంచ్ రమేష్, పెద్దపోర్ల మాజీ సర్పంచ్ రవికుమార్, బిజెపి మాజీ మండల అధ్యక్షుడు రమేష్, వార్డ్ మెంబర్లు గ్రామ పెద్దలు సాయిలు, గాల నరసింహులు, జీర్ణల్లి కృష్ణయ్య, కాట్రాజ్, సాలే లక్ష్మయ్య, బోయిన్పల్లి వెంకటేష్, సంటిరాము, బోయిన్పల్లి నరేష్ కుమార్, సత్యం అంజి తదితరులు పాల్గొన్నారు.
