96percent | మొబైల్ మోజు…ఆన్‌లైన్ ఒత్తిడులు

96percent | మొబైల్ మోజు…ఆన్‌లైన్ ఒత్తిడులు
96percent | పిల్లల మానసిక స్థితిలో విపరీత పరిణామాలు
పెరుగుతున్న మైనర్ ఆత్మహత్యలు
తల్లిదండ్రులు అప్రమత్తం కావాలని
నిపుణుల సూచనలు
96percent | హైదరాబాద్, ఆంధ్రప్రభ : ఇటీ-వలి కాలంలో పిల్లల్లో సెల్ ఫోన్ వినియోగం విపరీత పరిణామాలకు దారితీస్తోంది. అదే సమయంలో చదువుల విషయంలో చిత్తశుద్ది కోల్పోయి, ఒత్తిడికి గురై పిరస్థితులు ఆందోళనకరంగా మారాయి. ఆన్లైన్ క్లాసుల పేరిట చదువుల కోసం ఇచ్చిన స్మార్ట్ ఫోన్లు ఇప్పుడు చాలామంది విద్యార్థులకు వ్యసనంగా మారుతున్నాయి. ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియా, వీడియోలతో గంటల తరబడి గడిపే అలవాటు- పెరుగుతోంది. ఈ నేపథ్యంలో చిన్న విషయాలకే భావోద్వేగానికి లోనై మైనర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనలు పెరుగుతున్నాయి.

పోలీసు కేసులు, వార్తా నివేదికలను పరిశీలిస్తే ఇటీ-వల జరిగిన ఆత్మహత్యల్లో ఎక్కువ సంఖ్యలో మైనర్లు ఉన్నారు. ముఖ్యంగా మొబైల్ ఫోన్ వినియోగంపై తల్లిదండ్రులు మందలించడం, ఫోన్ తీసేయడం, ఆన్‌లైన్ గేమ్ ఆడనివ్వకపోవడం వంటి కారణాలు కూడా కొన్ని ఘటనల్లో బయటపడుతున్నాయి. ఫిబ్రవరి నెలలో ఓ 12 సంవత్సరాల అబ్బాయిని ఫోన్లో వీడియోలు చూడవద్దని, గేమ్స్ ఆడవద్దని, స్కూల్‌కు క్రమం తప్పకుండా వెళ్లాలని తండ్రి హితవు పలకడంతో ఆ విద్యార్థి ఫ్యాన్ కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బంజారాహిల్స్ పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.

గత ఏడాది అగస్టు నెలలో నిర్మల్ జిల్లా భైన్సాకు చెందిన 13 ఏళ్ల 9వ తరగతి బాలుడు బ్యాటిల్ గ్రౌండ్ పబ్జీ ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని తల్లిదండ్రులు ఆపడంతో…. ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ నగరం సైదాబాద్ లో… గత సంవత్సరం మే నెలలో ఓ 16 ఏళ్ల విద్యార్థి పరీక్షల సమయంలో కూడా ఫోన్ గేమ్స్ ఆడుతున్నాడని తల్లిదండ్రులు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. నిపుణుల అభిప్రాయం ప్రకారం మొబైల్ వ్యసనం వల్ల పిల్లల్లో మానసిక స్థితి మారిపోతోంది. వర్చువల్ ప్రపంచంలో ఎక్కువ సమయం గడపడం వల్ల వాస్తవ జీవితంలో ఎదురయ్యే చిన్న సమస్యలను కూడా తట్టు-కోలేని పరిస్థితి ఏర్పడుతోంది.
ఆన్‌లైన్ గేమ్స్‌లో ఓటమి, సోషల్ మీడియాలో పోలికలు, ఇతరుల కామెంట్లు- వంటి అంశాలు కూడా చిన్నారుల మనస్తత్వాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఈ కారణాల వల్ల కొంతమంది విద్యార్థులు తీవ్ర భావోద్వేగానికి లోనై ప్రమాదకర నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఏర్పడుతోంది. 82.5 శాతం మంది మైనర్లు సోషల్ మీడియాను వాడుతున్నారు. 2024-2025లో విడుదలైన ఆన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట్ ప్రకారం తెలంగాణలో 14-16 సంవత్సరాల వయస్సు గల పిల్లల్లో 96 శాతం మందికి ఇంట్లో స్మార్ట్‌ఫోన్ అందుబాటులో ఉంది.

92.3 శాతం మంది పిల్లలు స్మార్ట్‌ఫోన్ వాడడం తెలుసు. 61.1శాతం మంది ఫోన్‌ను చదువు సంబంధిత పనుల కోసం ఉపయోగిస్తున్నారు. అయితే 82.5శాతం మంది పిల్లలు సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నట్లు- సర్వేలో వెల్లడైంది. తెలంగాణలో చాలా మంది పిల్లలు ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు.
హైదరాబాద్ ప్రాంతంలో సుమారు 41.3శాతం పిల్లలకు స్వంత సోషల్ మీడియా ఖాతాలు ఉన్నట్లు- అధ్యయనాలు సూచిస్తున్నాయి. సోషల్ మీడియా వినియోగం పెరగడంతో సైబర్ బులీయింగ్, ప్రైవసీ సమస్యలు వంటి ఘటనలు హైదరాబాద్‌లో నెలకు సుమారు 20 కేసులు నమోదవుతున్నాయి అని నిపుణులు చెబుతున్నారు.
96percent | 13 ఏళ్ల లోపు వారికి సోషల్ మీడియా బ్యాన్ చెయ్యాలి…

ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం సోషల్ మీడియా యూజర్ల విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుంది. 13 ఏళ్ల లోపు వయసు వారు సోషల్ మీడియా వాడొద్దని బ్యాన్ చసేందుకు ప్రయత్నం చేస్తోంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా ఇలాంటి ప్రతిపాదనలు చేస్తే పిల్లలను సోషల్ మీడియా వ్యసనం భారి నుండి రక్షించుకున్న వాళ్లమవుతామని పిల్లల తల్లిదండ్రులు, మానసిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
96percent | పరిష్కారంలో… తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకం

చిన్నారులు సామాజిక మాధ్యమాలను వినియోగించకుండా నిషేధించడం అంత తేలికైన పని కాదు. దాన్ని అమలు చేయాలంటే సాంకేతికపరమైన మౌలిక సౌకర్యాలు అవసరమవుతాయి. ఇంటర్నెట్ వినియోగంలో వయసు ధ్రువీకరణ పక్కాగా అమలుచేసేలా చూడాలి. అభివృద్ధి చెందిన చాలా దేశాల్లో అందుకోసం తీవ్ర ప్రయత్నాలే జరుగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న భారత్ వంటి దేశాల్లో అటు-వంటి నిర్ణయాలు తీసుకోవడానికి, అమలు చేయడానికి చాలా సమయం పడుతుంది.
అంతవరకు ఈ సమస్య మరింత పెద్దది కాకుండా ఉండాలంటే- తల్లిదండ్రులు, ఉపాధ్యాయులే కీలక పాత్ర పోషించాలి. పిల్లలు సామాజిక మాధ్యమాల్లో ఏం చేస్తున్నారనే దానిపై వారు ఓ కన్నేసి ఉంచాలి. ప్రభుత్వం పాఠ్య ప్రణాళికలో డిజిటల్ అక్షరాస్యతకు చోటివ్వాలి. సోషల్ మీడియా వల్ల కలిగే లాభనష్టాలు, మంచి చెడుల గురించి పాఠ్యాంశాల ద్వారా పిల్లలకు వివరించాలి. సామాజిక మాధ్యమాలు కూడా బాలబాలికల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని బాధ్యతగా వ్యవహరించాలి.
96percent | తల్లిదండ్రులు పిల్లల ముందు ఫోన్ వాడకుండా… వారితో సమయం గడపండి.
-సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ ఎంఏ కరీం, రాష్ట్ర అధ్యక్షుడు, తెలంగాణ సైకలాజికల్ అసోసియేషన్.

ఆధునిక జీవనశైలిలో పిల్లలు శారీరక శ్రమకు దూరమై ఎక్కువసేపు సోషల్ మీడియా ఫోన్ లో గేమ్స్, షార్ట్ రీల్స్, ఆన్ లైన్ గేమ్స్, వాట్సాప్, యూట్యూబ్ ఇంస్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాలలో మునిగి తేలుతున్నారు. ఇది పిల్లల మానసిక స్థితిపై తీవ్ర ప్రభావం చూపుతున్నది, స్క్రీన్ -టైం అనేది అధికమైతే పిల్లలలో డిజిటల్ డిపెండెన్స్ డిజార్డర్ లక్షణాలు పెరుగుతున్నాయి. ఇంట్లో చిన్న పిల్లలకు స్మార్ట్ ఫోన్ దూరంగా ఉంచండి.
తల్లిదండ్రులు సాధ్యమైనంత వరకు పిల్లల ఎదురుగా లేక పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు స్మార్ట్ ఫోన్ వినియోగం పూర్తిగా తగ్గించాలి. పిల్లల దృష్టిని శారీరక శ్రమను కలిగించే ఆటల వైపు మళ్ళించాలి. పిల్లలతో ఎక్కువ సమయం గడపాలి. పిల్లలు చెప్పే విషయాలను సావధానంగా వినాలి. సెలవు రోజుల్లో కూడా పిల్లలకు స్మార్ట్ ఫోన్ అందకుండా జాగ్రత్తపడాలి. స్మార్ట్ ఫోన్ వైపు వారి దృష్టి వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
స్మార్ట్ ఫోన్ అతి వినియోగంతో వచ్చే సమస్యలను చెప్పాలి. స్కూల్ నుంచి రాగానే బ్యాగ్ పక్కన పెట్టి ఫోను పట్టు-కునే ధోరణి మంచిది కాదు. స్మార్ట్ ఫోన్ వ్యసనానికి బానిస అయిన పిల్లలలో వాస్తవ ప్రాపంచిక అంశాలపై విముఖత ఏర్పడుతున్నది. ఇలాంటి పిల్లలు అమ్మ నాన్నలను కూడా పట్టించుకోరు. కుటు-ంబ సభ్యులతో కలవరు కేవలం స్మార్ట్ ఫోన్ తో కాలం గడుపుతారు. పిల్లలు స్మార్ట్ ఫోన్ కారణంగా సామాజిక ఒంటరితనానికి గురికాకుండా తల్లిదండ్రులు జాగ్రత్త పడాలి.
96percent | పిల్లల అభివృద్ధికి విద్య, శారీరక వ్యాయామం, సాంకేతిక వినియోగం మధ్య సమతుల్యత అవసరం.
క్యాదవేని నాగరాజు, హైకోర్టు న్యాయవాది.

డిజిటల్ ప్రపంచం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పిల్లల ఆన్‌లైన్ భద్రతపై ప్రభుత్వం, న్యాయస్థానాలు ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. సుప్రీం కోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పిల్లల ఆన్‌లైన్ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచిస్తూ, హానికర కం-టె-ంట్ ప్రభావం నుంచి రక్షించే చర్యలు తీసుకోవాలని తెలిపింది. నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ-2020లో పిల్లల అభివృద్ధికి విద్య, శారీరక వ్యాయామం, సాంకేతిక వినియోగం మధ్య సమతుల్యత అవసరమని పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం సైబర్ స్వచ్చ కేంద్ర, డిజిటల్ ఇండియా కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పిస్తోంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొ-టె-క్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ పాఠశాలలు, తల్లిదండ్రులకు మార్గదర్శకాలు జారీ చేస్తూ స్కీన్ర్ -టైమ్ పరిమితం చేసి, పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను పర్యవేక్షించాలని సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాలను పిల్లల తల్లిదండ్రులు పాటించి, వారితో ఎక్కువ సమాయాన్ని గడపాలి. దీంతో తల్లిదండ్రుల, పిల్ల్లల మద్య బాండింగ్ పెరుగుతుంది. సెల్ ఫోన్ పై దృష్టి మళ్లే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పిల్ల్లలకు చక్కటి భవిష్యత్తుకు మార్గం సుగమమం చెయ్యాలి.
