91 applications | దివ్యాంగులకు గృహాలు..

91 applications | దివ్యాంగులకు గృహాలు..

91 applications | గుంటూరు, ఆంధ్రప్రభ : దివ్యాంగుల గృహాలు మంజూరుకు అర్హుల జాబితా తయారు చేయాలని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా(Collector Tamim Ansaria) అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల గృహాల పై జిల్లా కలెక్టర్ సమీక్షించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అర్హుల జాబితా తయారు చేయాలని అందులో వారి ఆధార్ చిరునామా(Aadhaar address), జాబ్ కార్డు తదితర వివరాలను పరిశీలించాలని అన్నారు. అవసరమైతే.. ఆధార్ చిరునామా మార్పు చేయాల్సి ఉంటుందని, అందుకు వారి సంసిద్ధతను తెలుసుకోవాలని సూచించారు.

జిల్లాకు చెందిన వారిని పరిగణనలోకి తీసుకోవాలని అన్నారు. జిల్లా విభిన్న ప్రతిభావంతుల శాఖ సహాయ సంచాలకులు డి.దుర్గా భాయి మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకూ 91 దరఖాస్తులు(91 applications) అందగా వాటిలో జిల్లాలో ఆధార్ కలిగిన వారు 72 మంది ఉన్నారని, 19 మంది ఇతర జిల్లాలకు చెందినవారు ఉన్నారని చెప్పారు.

Leave a Reply