నిరుపేదల సంక్షేమమే నా లక్ష్యం..

-8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పొన్న రాజేష్
-గెలిచిన వెంటనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తాను.
-వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను.
-కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించండి.
స్టేషన్‌ఘన్‌పూర్, ఫిబ్రవరి4 ఆంధ్రప్రభ: నిరుపేదల సంక్షేమమే నా లక్ష్యంగా ప్రజాసేవలో ముందుకు సాగుతు న్నాను. గెలిచిన వెంటనే ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తూ, 8వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తాను. కారు గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని 8వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి పొన్న రాజేష్ ఈ సందర్బంగా కోరారు.బుధవారం వార్డ్ లో స్థానిక నాయకులతో కలి సి ఆయన ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటికి వెళ్లి ఓటు ను అభ్యర్థించి ఓటరును గెలిపించాలని కోరారు. అదే విధంగా వార్డ్ సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రాజేష్ మాట్లాడు తూ పెండింగ్‌లో ఉన్న పథకాలు, ఇప్పటివరకు అర్హులకు అందని పథ కాలు అందేలా ప్రత్యేకంగా దృష్టి సారిస్తానని తెలిపారు.వార్డులో ప్రధాన సమస్యలైన డ్రైనేజీ సమస్యలు, సీసీ రోడ్ల నిర్మాణం, వీధి దీపాల నిర్వ హణపై ప్రత్యేక దృష్టి పెట్టి అభివృద్ధి పనులు చేపడతానని తెలిపారు.
