8 to 22 percent | కపాస్ కిసాన్ యాప్ ఎత్తేసే వరకు రాజీ లేని పోరు..!

8 to 22 percent | కపాస్ కిసాన్ యాప్ ఎత్తేసే వరకు రాజీ లేని పోరు..!

  • పత్తి రైతుల సమస్యలపై రేపు జాతీయ రహదారి దిగ్బంధం…!
  • రైతు సమస్యలపై చిత్తశుద్ధిలేని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు

8 to 22 percent | ఉమ్మడి ఆదిలాబాద్, ఆంధ్రప్రభ : స్మార్ట్ ఫోన్‌లు లేని, నెట్వర్క్ అందుబాటులో లేని ప్రాంతాల్లో కపాస్ కిసాన్ యాప్(Kapas Kisan App) పేరిట కేంద్రం పత్తి రైతులను దగా చేస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జోగు రామన్న ఆరోపించారు.

ఈ రోజు మీడియా సమావేశంలో ఆయన అదిలాబాదులో మాట్లాడుతూ.. పత్తి కొనుగోళ్లలో తేమ శాతం నిబంధన 8 నుండి 22 శాతాని(8 to 22 percent)కి పెంచాలని, రైతులకు శాపంగా మారిన కిసాన్ కపాస్ యాప్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అక్షరాస్యత లేని అమాయక రైతులకు కిసాన్ యాప్ గుదిబండగా మారిందన్నారు.

మార్కెట్ యార్డు(Market Yard)ల్లో పంట కొనుగోళ్ల విషయంలో రైతులు అవస్థలు పడుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పాలకులు రైతుల సమస్యకు పరిష్కారం చూపకుండా తప్పించుకు తిరుగుతున్నారని విమర్శించారు.

పత్తి, సోయాబీన్ కొనుగోల్లలో ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను నిరసిస్తూ, అఖిలపక్షం ఆధ్వర్యంలో శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా బోరజ్ జాతీయ రహదారి (44) పై రైతులతో కలిసి దిగ్భంధం చేస్తామన్నారు. వాహనాల రాకపోకలు స్తంభింప చేస్తామన్నారు. సీసీఐ దిగి వచ్చేవరకు పోరుబాట ఆగదని రామన్న అన్నారు.

ఎంపీ ఇల్లు ముట్టడి, రైతు సమస్యలపై బెలలో రాస్తారోకో(Rastaroko), బీఆర్ఎస్ నేత కేటీఆర్ జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు దిగివచ్చి పంట కొనుగోళ్ల పరిమితిని సడలించారని ఇది రైతుల విజయమని రామన్న ఆన్నారు. రైతులు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు. మీడియా సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ యాసం నర్సింగ్ రావు, పోచ‌న్న‌, జగదీష్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply