అభ్యర్థి సునీల్ కు మహిళా ఓటర్ల ఆదరణ..

అభ్యర్థి సునీల్ కు మహిళా ఓటర్ల ఆదరణ..

కాంగ్రెస్ పార్టీ పరకాల మున్సిపల్ చైర్మన్

పరకాల, ఫిబ్రవరి 7 (ఆంధ్రప్రభ): కాంగ్రెస్ పార్టీ పరకాల మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ కు మహిళా ఓటర్ల ఆదరణ లభించింది. శనివారం రోజు పరకాల పురపాలక సంఘం విలీన సీతారాంపురం గ్రామం 7వ వార్డులోని ఇంటింటికి తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహించారు. చైర్మన్ అభ్యర్థి పావుశెట్టి సునీల్ పరకాల పట్టణ ప్రజలకు సుపరిచితులు ప్రచారంలో ఏ వీధికి వెళ్ళిన ఓటర్లను బంధుత్వంతో పలకరించడం జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్ అభ్యర్థి సునీల్ మాట్లాడుతూ ఎన్నికల్లో ఓటర్లు ఆశీర్వదించాలని, పరకాల పురపాలక సంఘాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. వార్డులోని ప్రజా సమస్యల పరిష్కారానికి శాశ్వత కృషి చేస్తానని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply