77 DDO offices | డీడీఓ కార్యాల‌యాల‌తో అభివృద్ధి ప‌రుగులు

77 DDO offices | డీడీఓ కార్యాల‌యాల‌తో అభివృద్ధి ప‌రుగులు

  • జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ

77 DDO offices | మచిలీపట్నం, ఆంధ్రప్రభ : పంచాయతీ రాజ్ వ్యవస్థ బలోపేతానికి డివిజనల్ అభివృద్ధి అధికారుల కార్యాలయాలు ఎంతగానో తోడ్పడతాయని జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ(DK Balaji) పేర్కొన్నారు. ఈ రోజు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లాలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయంతో పాటు రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన(Newly built) మొత్తం 77 డీడీఓ కార్యాలయాల‌ భవనాలను వర్చువల్ గా ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో మచిలీపట్నం మండలంలోని పోతేపల్లి గ్రామ సచివాలయ పై భాగంలో నూతనంగా నిర్మించిన డివిజనల్ అభివృద్ధి అధికారి కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్, పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్(Kagita Krishna Prasad), రాష్ట్ర ఎంజిఎన్ఆర్ఇజిఎస్ అదనపు కమిషనర్ శివప్రసాద్ లతో కలిసి ప్రారంభించారు. అనంతరం వారు డీడీఓ, డీఎల్పీఓ, ఏపీఓ, సిబ్బంది గదులను పరిశీలించారు. అనంత‌రం కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు(Plants) నాటారు.

77 DDO offices

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంత ప్రజలు, వారికి సంబంధించిన వివిధ రకాల పనుల కోసం జిల్లా కేంద్రానికి రాకుండా డివిజనల్ స్థాయిలో ఏర్పాటుచేసిన డివిజనల్ అభివృద్ధి(Divisional development) అధికారి కార్యాలయాల వద్దకు రావాలన్నారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి శాఖ ద్వారా అమలుపరుస్తున్న పలు రకాల సంక్షేమ అభివృద్ధి పథకాలపై డివిజనల్ స్థాయిలో డివిజనల్ అభివృద్ధి అధికారులు సజావుగా పర్యవేక్షించాలన్నారు. వారికోసం రాష్ట్ర ప్రభుత్వం(State Govt) ప్రత్యేకించి డివిజనల్ అభివృద్ధి కార్యాలయ భవనాలను నూతనంగా నిర్మించడం ప్రజలకు ఎంతగానో సౌకర్యవంతంగా ఉందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.

పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ప్రజలకు మెరుగైన సేవలు అందించే విధంగా పంచాయతీరాజ్(Panchayati Raj) వ్యవస్థను పటిష్టం చేయడం సంతోషదాయకమన్నారు. ప్రజలకు అందుబాటులో డివిజనల్ అధికారుల కార్యాలయాలు ఏర్పాటు కావడం శుభ పరిణామం అన్నారు.

కార్యక్రమంలో రాష్ట్ర ఆక్వా కల్చర్ అభివృద్ధి సంస్థ డైరెక్టర్ లంకె నారాయణ ప్రసాద్, డీసీఎంఎస్ చైర్మన్ బండి రామకృష్ణ, జిల్లా పరిషత్ సిఈఓ కె.కన్నమనాయుడు, డ్వామా పీడీ శివప్రసాద్, డీఎల్‌డీఓ జి పద్మ, డీఎల్‌పీఓ రజావుల్లా(DLPO Rajaullah), ఎంపీడీవో వెంకటేష్, తహసీల్దారు నాగభూషణం, మున్సిపల్ కమిషనర్ బాపిరాజు, రాష్ట్ర మచిలీపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కుంచె నాని, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ గొర్రెపాటి గోపీచంద్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గోపు సత్యనారాయణ(Gopu Satyanarayana), మాజీ సర్పంచ్ కాటం మధుసూదన్ హెచ్‌డీఎస్ మాజీ చైర్మన్ సోమశేఖర్, స్థానిక నాయకులు శ్రీపతి చంద్రబాబు, కమ్మిని మధుసూదన్, బండి శివ, ఎంపీడీవోలు డిప్యూటీ ఎంపీడీవోలు తదితర అధికారులు అనధికారులు పాల్గొన్నారు.

Leave a Reply