6 years | ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

6 years | ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు

  • భగ్గుమన్న పాత కక్షలు – కోర్టు ఆవరణలో దాడి
  • మరదలి తలపై బండరాయితో కొట్టిన భావ
  • పోలీసుల అదుపులో నిందితుడు

6 years | జనగామ, ఆంధ్రప్రభ : పాత కక్షల నేపద్యంలో కేసు విచారణ నిమిత్తం కోర్టు(Court)కు వచ్చిన మరదలి తలపై బండరాయితో భావ దాడి చేసిన ఘటన జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించింది. ఈ రోజు జరిగిన ఈ సంఘటన పై బంధువులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. 6 సంవత్సరాల(6 years) క్రితం బచ్చనపేట మండలం కట్కూర్ గ్రామానికి చెందిన బాలయ్య, యాదమ్మ కూతురు అండాలు ఎలియాస్ అర్చనను చేర్యాల మండలం చుంచనకోట గ్రామానికి చెందిన బూడిద అశోక్ కు ఇచ్చి వివాహం చేశారు.

కొద్ది రోజులు గ్రామంలో ఉన్న వీరు బ్రతుకుతెరువు కోసం హైదరాబాద్(Hyderabad)కు వెళ్ళగా అక్కడ మద్యంకు బానిసైన అశోక్ అర్చన పై దాడులకు పాల్పడడం, వరకట్నం కోసం వేధించడం, ఆ నైతిక పనులు చేయాలని వేధించడంతో అర్చన కుటుంబ సభ్యుల చెంతకు చేరగా ఇరు కుటుంబాల మధ్య గొడవలు కొనసాగుతున్నాయి.

ఈ నేపథ్యంలో అశోక్ తన కుమారుడిని కిడ్నాప్ చేశాడన్న ఆరోపణపై భార్య కుటుంబ సభ్యులు పోలీస్ కేసు నమోదు చేశారు. ఈ కేసు నడుస్తున్న క్రమంలోనే నాలుగు సంవత్సరాల క్రితం భార్యతో పాటు వారీ కుటుంబ సభ్యులపై దాడి చేసేందుకు కట్కూరు గ్రామానికి వచ్చి దాడికి ప్రయత్నిస్తున్న క్రమంలో వారు తిరిగి దాడి చేయడంతో అశోక్ అక్కడికక్కడే మృతి చెందాడు.

ఈ కేసు కూడా కోర్టులో నడుస్తున్న నేపథ్యంలో ఇరువర్గాలవారు కేసులను ఉపసంహరించుకొని ముందుకెళ్లాలని భావించారు. కాగా ఈ రోజు జిల్లా కోర్టులో కిడ్నాప్‌(kidnapping)కు సంబంధించిన కేసు తీర్పు చెప్తారని భావించి ఇరువర్గాలవారు కోర్టుకు వచ్చారు. ఈ సందర్భంగా మృతుడు అశోక్ అన్న బూడిద నర్సింలు అకస్మాత్తుగా బండరాయితో మరదలు అర్చన తల పై దాడికి పాల్పడ్డాడు.

ఈ సందర్భంగా అర్చనకు తీవ్ర గాయాలు కాగా కుప్పకూలిపోయింది వెంటనే పోలీసులు, బంధువులు అర్చనను సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా దాడికి పాల్పడ్డ నిందితుడు(accused) అక్కడే ఉండటంతో పోలీసులు అతన్నీ అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అర్చన పరిస్థితి 24 గంటలు గడిస్తే కానీ చెప్పలేమని, ప్రస్తుతం చికిత్సకు స్పందిస్తున్నారని వైద్యులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Leave a Reply