అభివృద్ధి చేస్తా.. అవకాశం ఇవ్వండి

అభివృద్ధి చేస్తా.. అవకాశం ఇవ్వండి

  • 5వ వార్డు బిఆర్ ఎస్ అభ్యర్థి బానోత్ మోహన్ నాయక్

ఖమ్మం రూరల్, ఆంధ్రప్రభ : ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో తనను ఓటర్లు ఆశీర్వదించి గెలిపిస్తే… వార్డును అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని 5 వ వార్డు బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థి బానోత్ మోహన్ నాయక్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల్లో భాగంగా నిత్యం వార్డులో పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులతో ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తూన్నారు. ఇంటింటికి తిరుగుతూ ఓటర్లను కలుస్తూ మీ అమూల్యమైన ఓటు కారు గుర్తుపై వేసి తనను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు. తనను గెలిపిస్తే 5 వ వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. వార్డు ప్రజలు ఈనెల 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని అభ్యర్థి బానోత్ మోహన్ నాయక్ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు..

Leave a Reply