ఇంగ్లండ్ : అండర్సన్-టెండూల్కర్ (Anderson-Tendulkar) ఐదు టెస్టుల సిరీస్ (Five Test series) లో భాగంగా ఇంగండ్ (England) లోని ఓవల్ లో భారత్ వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య ఐదవ టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఫీల్డింగ్ (Fielding) తీసుకుంది. దీంతో భారత్ జట్టు ముందుగా బ్యాటింగ్ చేయనుంది. ఈ టెస్టు మ్యాచ్ లో భారత్ గెలిస్తే సిరీస్ సమం అవుతుంది. ఒకేవళ ఇంగ్లండ్ ఈ మ్యచ్ లో గెలిస్తే సిరీస్ వాళ్లదే అవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ 5వ టెస్ట్ ఇద్దరికీ కీలకమే కావడంతో ఈ మ్యాచ్ లో గెలిచేందుకు ఇరు జట్లూ గట్టీ పోటీ ఇవ్వనున్నాయి.
జట్లు..
ఇంగ్లాండ్:
క్రాలీ, డకెట్, పోప్, రూట్, బ్రూక్, జాకబ్, స్మిత్, వోక్స్, అట్కిన్సన్, ఓవర్టన్, జోష్
భారత్:
జైస్వాల్, కేఎల్ రాహుల్, సుదర్శన్, గిల్, కరుణ్, జడేజా, జురెల్, వాషింగ్టన్, అన్షుల్, ప్రసిద్ధ, సిరాజ్.