57kfollowers | యూట్యూబర్ వైష్ణవి హత్యలో షాకింగ్ మలుపు

57kfollowers | యూట్యూబర్ వైష్ణవి హత్యలో షాకింగ్ మలుపు

57kfollowers | వైష్ణవి హత్య కేసులో సంచలన మలుపు
తల్లీసోదరుల ఒత్తిళ్లే కారణమా?
ఏడు నెలల పెళ్లి… దారుణాంతం
ప్రేమ వివాహం నుంచి హత్య వరకు
పాపులారిటీ మధ్యలోనే విషాదం
పోలీసుల దర్యాప్తులో కొత్త విషయాలు

57kfollowers | కోడలిని చంపించింది కొడుకును హంతకుడిని చేసింది

ఏడు నెలల క్రితమే పెళ్లి.. అంతలోనే దారుణం తల్లికి ఇష్టం లేని పెళ్లి.. తరచూ గొడవలు హంతకుడు రిమాండ్.. తల్లీసోదరులపై కేసు నమోదు యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో కీలక మలుపు

హైదరాబాద్, ఆంధ్రప్రభ: తల్లీసోదరులు ప్రేరేపించడంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఇల్లాలిని కాటికి పంపాడు. పెళ్లి చేసుకుని ఏడాది కూడా నిండకముందే భార్యకు నూరేళ్లు నిండేలా చేశారు. ప్రాణాలు కోసం పోరాడుతూ గిలిగిలా కొట్టుకుంటున్న భార్యను చూసినా కూడా అతగాడి మనసు కరగలేదు. ఆమె చనిపోయిందని నిర్ధారించుకుని అక్కడినుంచి పారిపోయాడు. రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో అదనపు కట్నం కోసమే ఈ దారుణం జరిగినట్లు పోలీసులు తేల్చారు.

57kfollowers
57kfollowers

నిందితుడి వాంగ్మూలం మేరకు తల్లి, సోదరుల ఒత్తిళ్లేహత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. జగిత్యాల జిల్లా కోరుట్ల పరిధిలోని మాదాపూర్ లో జరిగిన ఈ సంఘటన కలకలం రేపింది. సోమవారం అర్ధరాత్రి వైష్ణవిని మాదాపూర్లోని ఆమె ఇంట్లోనే చంపేసిన హరిబాబు.. ఆ వెంటనే పరారయ్యాడు. ఉదయం విగత జీవిగా పడి ఉన్న వైష్ణవిని చూసిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు, హరిబాబును కోరుట్ల శివారులో మంగళవారం రాత్రి అరెస్ట్ చేసి, విచారణ అనంతరం బుధవారం రిమాండ్కు తరలించారు. వైష్ణవి హత్యకు పరోక్ష కారణమైన హంతకుడి తల్లి లక్షితోపాటు ఆయన సోదరులు అశోక్, ఆనంద్పై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే వారు ముగ్గురు కూడా పరారీలో ఉన్నారని.. వెతుకుతున్నామని పోలీసులు తెలిపారు.


ఏడు నెలల క్రితమే పెళ్ళి.. అంతలోనే దారుణం

యూట్యూబ్ రీల్స్తో స్థానికంగా పాపులారిటీ సాధించిన వైష్ణవిని చూసి మనసుపడిన హరిబాబు ప్రేమిస్తున్నానని పెళ్లి చేసుకుంటానని వెంటపడ్డాడు. అందుకు వైష్ణవి కూడా ఓకే చెప్పడంతో వారిద్దరూ ఏడు నెలల క్రితం పెళ్ళిచేసుకున్నారు. పెళ్ళి సమయంలో రూ.5లక్షల నగదు, రెండు గుంటల భూమి కూడా వైష్ణవి కుటుంబం కట్నం కింద హరిబాబుకు రాసిచ్చింది. అయితే వీరిద్దరి పెళ్లి హరిబాబు తల్లికి నచ్చలేదు. పెద్దగా ఆస్తిపాస్తులు లేని వైష్ణవితో పెళ్లి వద్దని చెప్పినప్పటికీ హరిబాబు వినలేదు. దీంతో పెళ్లి తర్వాత నుండి వైష్ణవిని హరిబాబు తల్లి సూటిపోటి మాటలతో వేధిస్తూ ఉండేది. ఈ క్రమంలో వైష్ణవిని వదిలించుకోవాలంటూ తమ్ముడు హరిబాబుపై తల్లి, సోదరులు ఒత్తిడి తెచ్చారు. అప్పటికే వైష్ణవి గర్భం దాల్చడంతో పిల్లలు పుట్టేవరకు ఎదురుచూస్తే ఇబ్బంది పడాల్సి వస్తుందని భావించి మరింత ఒత్తిడి పెంచారు. దీంతో సోమవారం సాయంత్రం పుట్టింట్లో ఉన్న వైష్ణవి దగ్గరికి వెళ్లిన హరిబాబు.. రాత్రి అమెతో గొడవ పడ్డాడు. ముందుగా తనతో తెచ్చుకున్న కత్తితో పొడిచి తర్వాత గొంతు నులిమి చంపేశాడు.


తక్కువ కాలంలోనే పాపులారిటీ..

పెళ్ళి తర్వాత యూట్యూబ్ చానెల్ పెట్టి హరిబాబు, వైష్ణవి కలిసి వీడియోలు చేశారు. తక్కువ కాలంలోనే 57 వేల మంది ఫాలోవర్స్ను సంపాదించుకున్నారు. స్థానిక అంశాలపై భాష, యాసపై పట్టుతో వీరు చేసిన యూట్యూబ్ వీడియోలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. పాపులారిటీ సాధిస్తున్న సమయంలో తల్లీసోదరుల మాటలు విని హరిబాబు హంతకుడిగా మారాడని, ఉజ్వల భవిష్యత్తును, జీవితాన్ని చేజేతులారా నాశనం చేసుకున్నాడని అతని స్నేహితులు అభిప్రాయపడుతున్నారు.

click here to read more crime news

click here to read Cat | పాపం డిగ్రీ చదువుతున్న యువతి…

Leave a Reply