మృతుని కుటుంబానికి బియ్యం అందజేత..

మృతుని కుటుంబానికి బియ్యం అందజేత..

హసన్ పర్తి, ఆంధ్రప్రభ : హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలం మల్లారెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాంబాల రాజేందర్ మృతి చెందడంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. ఈసమాచార మేరకు స్థానిక సర్పంచ్ గాజుల కృష్ణవేణి యుగందర్ యాదవ్, పంచాయతీ సభ్యులు మృతుని ఇంటికి వెళ్ళి, కుటుంబ సభ్యులను పరామర్శించి, మనో దైర్యంతో ఉండాలని భరోసా కల్పించారు.

ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి అండగా నిలవాలనే ఉద్దేశంతో 50 కిలోల బియ్యాన్ని కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎల్లవేళలా అండగా ఉంటామని కుటుంబ సభ్యులకు వారు హమీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్ ఒంటెలు కుమారస్వామితో పాటు పంచాయతీ సభ్యులు పాల్గొన్నారు.

Leave a Reply