5 km | మారథాన్ పోటీల్లో చిన్నారుల ప్రతిభ

5 km | మారథాన్ పోటీల్లో చిన్నారుల ప్రతిభ

5 km | శావల్యాపురం, ఆంధ్రప్రభ : పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం కారుమంచి గ్రామానికి చెందిన పోలా అక్షయ్, నితీషలు మారథాన్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చాటారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మహారాష్ట్రలోని పూణేలో శివాజీనగర్, బియంసీసీ గ్రౌండ్లో నిర్వహించిన ఐపీఏ నీరథాన్ మారథాన్ 2026 పోటీల్లో వీరు ఇరువురు ప్రతిభ చూపారు.

5 కి.మీ విభాగంలో అక్షయ్ తృతీయ స్థానం, 3 కి.మీ విభాగంలో నితీష ద్వితీయ స్థానం సాధించి పతకాలు, ప్రశంసాపత్రాలు అందుకున్నారు. వీరి తండ్రి పోలా అంకమ్మరావు పూణే లోని ఆర్మీ ఆర్డినెన్స్ కోర్లో హవాల్దారుగా పనిచేస్తున్నాడు. జాతీయ స్థాయిలో రాణించిన ఈ చిన్నారులను గ్రామస్థులు, క్రీడాకారులు అభినందిస్తున్నారు.

5 km |
5 km |

Leave a Reply