470th Urs | దర్గా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కర‌ణ‌…

470th Urs | దర్గా ఉత్సవాల పోస్టర్ ఆవిష్కర‌ణ‌…

470th Urs | కరీమాబాద్, ఆంధ్రప్రభ : వరంగల్ తూర్పు నియోజకవర్గం కరీమాబాద్ ఉర్సు దర్గా లో హజరత్ మాశూక్ రబ్బాని దర్గా 470వ ఉర్సు(470th Urs) ఉత్సవాలు ఈనెల 11, 12, 13వ‌ తేదీలలో నిర్వహిస్తామని మ‌తాధిపతులు నవీద్ బాబా, ఉబ్బేద్ బాబా తెలిపారు. దర్గా ఉత్సవాలకు సంబంధించిన పోస్టర్ ను ఈ రోజు ఉరుసు దర్గాలో విలేకరుల సమావేశంలో వారు ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా పీఠాధిపతులు మాట్లాడుతూ… దేశ విదేశాల నుండి మాశుక్ రబ్బాని 470 ఉత్సవాలకు హాజరై తమ మొక్కుబడులు చెల్లించుకుంటారని వారు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు రాష్ట్ర మంత్రి కొండ సురేఖ(Minister Konda Surekha), మేయర్, నగరపాలక సంస్థ కమిషనర్ హాజరవుతున్నారని తెలిపారు. ఉరుసు ద‌ర్గా ఉత్సవాలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు నగరపాలక సంస్థ ఏర్పాటు చేస్తుందని తెలిపారు. సమావేశంలో ముస్లిం మత పెద్దలు, దర్గాలోని పెద్దలు హాజరయ్యారు.

Leave a Reply