ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం

ఘనంగా బీజేపీ 46వ ఆవిర్భావ దినోత్సవం

కడెం, ఆంధ్రప్రభ : కడెం మండల కేంద్రంలో సోమవారం బీజేపీ మండల అధ్యక్షుడు కాశ వేణి శ్రీనివాస్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జెండా శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ… దేశ అభివృద్ధిలో బీజేపీ పార్టీ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాత్రను కొనియాడుతూ ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని తెలిపారు.

ఈ కార్యక్రమంలోబీజేపీఎస్టీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఇస్లావత్ మోహన్ నాయక్, బీజేపీ మండల ఉపాధ్యక్షుడు కళ్లెం రమణారెడ్డి, మండల ప్రధాన కార్యదర్శులు పూస శ్రీరామ్, రాపర్తి శ్రీనివాస్, సీనియర్ నాయకులు రవీందర్ గౌడ్, జక్కుల సత్తన్న, ముక్కెర గంగాధర్, ప్రసాద్, ధీరజ్, డి తిరుమలయ్య, పాలకుర్తి నగేష్, ముల్కీ కృష్ణ, మాధవ్ సింగ్, గడప దేవరాజ్, కొండయ్య, రంజిత్, శ్రవణ్, రమేష్, రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply