44th National | లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి…

44th National | లేబర్ కోడ్స్ ను వెంటనే రద్దు చేయాలి…
44th National | రాప్తాడు, ఆంధ్రప్రభ : మనదేశంలో కేరళ రాష్ట్రం ఒక్కటే లేబర్ కోడ్స్ అమలుకు నిరాకరించిందని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు రామాంజనేయులు పేర్కొన్నారు.కార్మికుల హక్కుల కోసం జరుగుతున్న దేశవ్యాప్త సమ్మెలో భాగంగా గురువారం రాప్తాడు మండల కేంద్రంలోని 44వ జాతీయ రహదారి నుండి రాప్తాడు మెయిన్ బజార్ మీదుగా ర్యాలీ నిర్వహించారు. అనంతరం డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన తెలిపారు.ఈ సంధర్భంగా మాట్లాడుతూ… నవంబర్ 2025న లేబర్ కోడ్స్ దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చాయి.
లేబర్ కోడ్స్ ను కార్మికులు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు.విద్యుత్ సవరణ బిల్లును బడ్జెట్ సమావేశాల్లో ఆమోదించడానికి కేంద్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిందన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయి. లేబర్ కోడ్స్ వ్యతిరేకంగా అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు సంయుక్త కిసాన్ మోర్చా తో కలిపి 620 సంఘాలు సమ్మె కార్యక్రమంలో పాల్గొన్నాయి. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు పోతులయ్య, సిఐటియు నాయకులు పుష్పరాజు, ఎస్ఎఫ్ఐ రాప్తాడు నాయకులు పరమేష్, మహేష్, ఎస్ఎఫ్ఐ ఎస్.కె సెక్రెటరీ శాంతి రాజు, పవన్, నాగేంద్ర, శివ, జయ ప్రకాష్, తులసి రామ్, అంగన్వాడీ కార్మికులు విజయలక్ష్మి, వరలక్ష్మి, సరస్వతి, రేణుక, ఓబులమ్మ, మంజుల, సావిత్రి, ఆశ వర్కర్లు నాగేంద్రమ్మ, లక్ష్మీ, జయ శ్రీ, చంద్రకళ, రామాంజినమ్మ, అనిత, అరుణ, వీరాంజనేయులు, కదరయ్య, ఓబులయ్య, లక్ష్మీదేవి, ముత్యాలమ్మ, లక్ష్మన్న, మల్లేష్, సుబ్బారావు, మధు, నారాయణస్వామి, తదితరులు పాల్గొన్నారు.
