42 years | నాడు డ‌బ్బు కోసం… నేడు రాజ‌కీయ మ‌న‌గుడ కోసం

42 years | నాడు డ‌బ్బు కోసం… నేడు రాజ‌కీయ మ‌న‌గుడ కోసం

42 years | విజ‌య‌వాడ‌, ఆంధ్రప్రభ : శాసన మండలిలో వైసీపీ ఎమ్మెల్సీలు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాలను రాజకీయ ప్లకార్డుల్లా ఉపయోగించడం, అనంతరం వాటిని నిర్లక్ష్యంగా వదిలేయడం సరికాదని, చిత్రపటాలతో రాజకీయాలు తగవని ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గద్దె అనురాధ విమర్శించారు.

శాసన మండలిలో వైసీపీ సభ్యులు తీరును నిరసిస్తూ శనివారం గురునాన‌క్ కాల‌నీలోని ఎంపీ కేశినేని శివ‌నాథ్ కార్యాలయంలో ఎమ్మెల్యే గద్దె రామ్మోహ‌న్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్య‌క్షుడు అడ్డూరి శ్రీరామ్, జ‌న‌సేన నాయ‌కులు గాదిరెడ్డి అమ్ములు, ఎన్టీఆర్ జిల్లా ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చెన్నుబోయిన చిట్టిబాబు, ఏపీ బిల్డింగ్‌ అదర్‌ కనస్ట్రక్షన్‌ వర్కర్స్‌ అడ్వయిజరీ కమిటీ చైర్మన్ గొట్టుముక్క‌ల ర‌ఘురామ‌రాజు, రాష్ట్ర నాగవంశం సంక్షేమ, అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్‌ ఎరుబోతు రమణారావు ల‌తో క‌లిసి ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మీడియా స‌మావేశం నిర్వ‌హించారు.

42 years |

ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు గద్దె అనురాధ మాట్లాడుతూ శ్రీవారి దేవుడి చిత్రాలను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం అత్యంత దుర్మార్గమని మండిపడ్డారు. హిందువుల ఆరాధ్య దైవాల చిత్రపటాలను శాసన మండలిలో ప్లకార్డుల్లా ప్రదర్శించి, నిరసన ముగిసిన తరువాత ఆ చిత్రాలను కుర్చీలు, టేబుళ్లపై వదిలేసి వెళ్లిపోవడం మరింత అవమానకరమని ఆమె విమర్శించారు. నాడు అధికార దుర్వినియోగం, నేడు రాజకీయ మనుగడ కోసం దేవుడిని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడుతున్నారన్నారు.

42 years |

వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ లడ్డును కల్తీ చేసి కళ్లకు అద్దుకుని తినే ప్రసాదాన్ని అనుమానంతో తినేలా చేశారని, టీటీడీ దేవస్థానంలో అన్య‌మ‌త‌ ప్రచారం చేశారన్నారు. జగన్ తన సొంత పిన్నితో జగన్ రక్షక గోవిందా అని ఏకంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో అనిపించుకున్నారని, దీన్ని బట్టే వారికి హిందూ మతంపై ఎటువంటి గౌరవం ఉందో తెలుస్తుంది అన్నారు. 42 ఏళ్ల క్రితం సిక్కులు ఎంతో ప‌విత్రంగా భావించే అమృత్ స‌ర్ లోని స్వ‌ర్ణదేవాల‌యంలో దాగిన‌ మిలిటెంట్ల‌ను పట్టుకునేందుకు ఆప‌రేష‌న్ బ్లూ స్టార్ నిర్వ‌హిస్తే.. ఆ తర్వాత ప‌ర్య‌వ‌సానాలు అంద‌రికి తెలుసున‌న్నారు. మ‌త విశ్వాసాల‌ను ఎప్పుడైనా గౌర‌వించాల‌ని హిత‌వు ప‌లికారు.

42 years |

వైసిపి ఎమ్మెల్సీలు ఇప్పటికైనా చేసిన తప్పును ఒప్పుకుని హిందూ సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాల‌ని గద్దె అనురాధ డిమాండ్ చేశారు. బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్య‌క్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ దేవదేవుని చిత్రాలను రాజకీయ వేదికగా మార్చడం వైసీపీ నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. జగన్ డైరెక్షన్‌లో వైసీపీ ఎమ్మెల్సీలు వ్యవహరించిన తీరు అత్యంత బాధాకరమని విమర్శించారు. ప్రజలు ఇప్పటికే తగిన తీర్పు ఇచ్చారని, అయినా వైసీపీ నాయకత్వం మార్పు చూపడం లేదన్నారు.

శాసన మండలిలో జరిగిన ఘటనపై చైర్మన్ తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. మతాన్ని రాజకీయ ఆయుధంగా మార్చడం మానుకుని రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాల‌ని, లేదంటే ప్రజలే మళ్లీ గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. జనసేన నేత గాదిరెడ్డి అమ్ములు మాట్లాడుతూ, హిందూ మత విశ్వాసాలను కించపరిచే విధంగా వ్యవహరించడం ప్రజలు సహించరన్నారు. దేవుడి చిత్రాలను ప్లకార్డులుగా ఉపయోగించడం మాత్రమే కాకుండా, వాటిని నిర్లక్ష్యంగా విసిరేయడం హిందువుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిందని తెలిపారు.

ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చెన్నుబోయిన చిట్టిబాబు మాట్లాడుతూ తప్పు చేసి దొరికిపోయిన తర్వాత కూడా రాద్దాంతం చేయడం సరికాదన్నారు. వైసీపీ నేతలు బహిరంగ క్షమాపణలు చెప్పి తమ తప్పును ఒప్పుకోవాలి” అని ఆయన డిమాండ్ చేశారు. . భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు శాస‌న‌మండ‌లిలోనే కాదు అసెంబ్లీ లో కూడా పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఎన్డీయే కూట‌మి ప్ర‌భ్వుతాన్ని కోరారు.

దేవాలయాల పవిత్రతను, మత విశ్వాసాలను కాపాడటం తమ బాధ్యతగా భావిస్తున్నామని, ప్రజల్లోకి నిజాలు తీసుకెళ్లి వైసీపీ ద్వంద్వ వైఖరిని బయటపెడతామని హెచ్చరించారు. ఈ సమావేశంలో బిజెపి తూర్పు నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జ్ కోల‌ప‌ల్లి గ‌ణేష్, ఎన్టీఆర్ జిల్లా బీజేపీ వైస్ ప్రెసిడెంట్ నున్న కృష్ణ‌, విజ‌య‌వాడ క‌న‌క‌దుర్గ అమ్మ‌వారి ఆల‌యం బోర్డ్ మెంబ‌ర్ అవ్వారు బుల్లాబ్బాయిల‌తో త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply