3AangleWar| సోషల్ మీడియానే యుద్ధభూమి

3AangleWar| సోషల్ మీడియానే యుద్ధభూమి

3AangleWar | సోషల్ మీడియా వేదికగా మారిన రాజకీయ పోరు
బీఆర్ఎస్ డిజిటల్ కౌంటర్ల దూకుడు
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు – కాంగ్రెస్ సోషల్ మీడియా వ్యూహం
కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో పింక్ పార్టీ సైన్యం
బీజేపీ సోషల్ మీడియా బలం – తెలంగాణలో సవాళ్లు
పేపర్ యుగం నుంచి స్మార్ట్‌ఫోన్ యుద్ధం వరకు
3AangleWar | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో అసలైన యుద్ధం క్షేత్రస్థాయిలో కాదు, సోషల్ మీడియా వేదికగా జరుగుతోంది. ఒకప్పుడు ఎవరైనా ఎవరిపైన అయినా విమర్శలు చేస్తే, మరుసటి రోజు పేపర్, టీవీ వార్తల్లోనో కనిపించేవి. కానీ నేడు సీన్ మారింది. సెకన్ల వ్యవధిలోనే విమర్శలు, అంత కంటే వేగంగా కౌంటర్లు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

తెలంగాణ రాజకీయ ముఖచిత్రంలో ఇప్పుడు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ మధ్య త్రిముఖ పోరు నడుస్తోంది. సోషల్ మీడియాను వాడుకోవడంలో బీఆర్ఎస్ ప్రస్తుతం మెరుపు వేగంతో వ్యహరిస్తుంది. అధికార పక్షం ఏదైనా ఆరోపణ చేసిన నిమిషాల్లోనే, దానికి సంబంధించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా టీమ్స్ గట్టి కౌంటర్ ఇస్తున్నాయి. మేము తప్పు చేయలేదు, మీరే ప్రజలను మోసం చేస్తున్నారు” అంటూ గణాంకాలతో సహా తిప్పికొడుతున్నారు. ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావుల నేతృత్వంలో ఈ విభాగం ఒక సైన్యంలా దుసుకుపోతుంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏమాత్రం తగ్గడం లేదు. గత ప్రభుత్వ లోపాలను, ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం వంటి వివాదాలను హైలైట్ చేస్తూ పింక్ పార్టీని ఇరకాటంలో పెడుతోంది. తెలంగాణ జాతిపిత అని పిలుచుకునే వారు రాష్ట్రానికి ఏం చేశారో చెప్పాలంటూ రేవంత్ రెడ్డి వేసే ప్రశ్నలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. ఆ వ్యాఖ్యలను హరిష్ రావు తీవ్రంగా ఖడించారు. గాంధీజీ దేశానికి జాతిపిత అయినట్టు తెలంగాణ సాధించిన కేసీఆర్ కుడా తెలంగాణకు జాతిపిత అవుతారని రేవంత్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.

బీజేపీ జాతీయ స్థాయిలో సోషల్ మీడియాలో బలంగా ఉన్నప్పటికీ, తెలంగాణలో కాంగ్రెస్-బీఆర్ఎస్ ఇస్తున్న కౌంటర్ల ముందు జంకుతుందన్న చర్చ ప్రజల్లో నడుస్తోంది. క్షేత్రస్థాయిలో కొందరూ నేతలు యాక్టివ్‌గా ఉన్నా, డిజిటల్ ప్లాట్‌ఫారమ్స్‌పై ప్రత్యర్థుల వేగాన్ని అందుకోవడంలో కొంత వెనుకబడినట్లు ప్రజల్లో భిన్నాప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే, అగ్ర నాయకత్వం రాష్ట్ర నేతలను సోషల్ మీడియాలో మరింత యాక్టివ్‌గా ఉండాలని హెచ్చరించినట్లు అనేక కథనాలు వినిపిస్తున్నాయి.
ఒకప్పుడు అధికార పార్టీ తిడితే మరుసటి రోజు ప్రతిపక్షం స్పందన కోసం ఆగేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. తప్పు అని ఒకరు అంటే, నీ తప్పులు ఇవిగో” అంటూ స్మార్ట్‌ఫోన్ యుద్ధం మారింది.
