31st Mahapooja | శోభాయమానంగా…
- పూర్ణపుష్కల కలశం ఊరేగింపు
- కలశం ఊరేగింపులో పోటెత్తిన భక్తులు.
- రహదారి పొడవున నీళ్లతో రహదారి శుభ్రం చేసి భక్తి చాటిన మహిళలు
31st Mahapooja | ఊట్కూర్, ఆంధ్రప్రభ : నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో శ్రీ అయ్యప్ప స్వామి 31వ మహాపూజ కార్యక్రమంలో భాగంగా గ్రామ పురవీధుల గుండా నిర్వహించిన పూర్ణపుష్కల కలశం ఊరేగింపు ఆధ్యాంతం అత్యంత భక్తిశ్రద్ధలతో కన్నుల పండుగ కొనసాగింది. ఇవాళ ఊట్కూర్ బస్టాండ్ శ్రీరామ్ నగర్ ఆంజనేయస్వామి దేవాలయం నుండి గ్రామ పురవీధుల గుండా నిర్వహించిన కలశం ఊరేగింపు కార్యక్రమం డప్పు మేళ తాళాల మధ్య వివిధ పాఠశాలల విద్యార్థులు మంగళహారతులతో ఊరేగింపులో పాల్గొనగా, మహిళలు రహదారి పొడవునా నిండుకుండలతో రోడ్లపై నీరుచల్లి తమ భక్తిని చాటారు.

శ్రీ అయ్యప్ప ఉత్సవ విగ్రహాన్ని వాహనంపై ఏర్పాటు చేసి కలశం ఊరేగింపుతో పాటు ఊరేగించడంతో భక్తులు శ్రీ అయ్యప్ప స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుండి భక్తులు పోటెత్తారు. మహా పూజ పురస్కరించుకొని నిర్వహించిన కలశం ఊరేగింపులో ఆధ్యంతం అత్యంత భక్తులతో శ్రీ అయ్యప్ప నామస్మరణతో ఊట్కూర్ పురవీధులు మార్మోగాయి. అనంతరం శ్రీ అయ్యప్ప స్వామి మహా పూజ ఘనంగా ప్రారంభమైంది. మహా పూజకు నారాయణపేట మక్తల్ ధన్వాడ దామరగిద్ద తదితర ప్రాంతాల నుండి స్వాములు భారీ ఎత్తున తరలిరాగా పలువురు స్వాములు పాదయాత్ర నతరలివచ్చి తమ భక్తిని చాటారు.

