ప్రజల మధ్యే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తా

ప్రజల మధ్యే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తా
బ్యాట్ గుర్తుకు ఓటేయాలని కోరుతున్న గొల్ల విజయలక్ష్మి ఆంజనేయులు
30వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గొల్ల విజయలక్ష్మి–ఆంజనేయులు
సంగారెడ్డి ప్రతినిధి, ఫిబ్రవరి 8 (ఆంధ్రప్రభ): ప్రజల మధ్యే ఉంటూ ప్రజల కోసం పనిచేస్తానని 30వ వార్డు స్వతంత్ర అభ్యర్థి గొల్ల విజయలక్ష్మి ఆంజనేయులు పేర్కొన్నారు. సంతోష్ నగర్, సాయి కృప నగర్, అయ్యప్ప కాలనీలలో ఇంటింటి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గడప గడపకు వెళ్లి ఓటర్లను ఆప్యాయంగా పలకరిస్తూ, వార్డు సమస్యలను తెలుసుకున్నారు. తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలను ప్రాధాన్యతగా పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనార్ధన్, తుల్జారాం, అజీజ్,సాయి కృప, అఖిల్, శ్రీధర్, తూర్పు ఆంజనేయులు, అరుణ్ చారి, కృష్ణ, ఆశిష్, వంశీ, సాయి తదితరులు పాల్గొని మద్దతు తెలిపారు.
