30 special buses | చిట్యాల నుంచి మేడారంకు 30 ప్రత్యేక బ‌స్సులు..

30 special buses | చిట్యాల నుంచి మేడారంకు 30 ప్రత్యేక బ‌స్సులు..

  • మహిళలకు మహాలక్ష్మి పథకం వర్తింపు
  • పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్ రాంప్రసాద్ వెల్లడి

30 special buses | చిట్యాల, ఆంధ్రప్రభ : ఈనెల 28 నుండి 31 వరకు జరిగే మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు జయశంకర్ జిల్లా చిట్యాల మండల కేంద్రం నుండి ఈనెల 27 నుండి 30 ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు పరకాల ఆర్టీసీ డిపో మేనేజర్ జి. రాంప్రసాద్ ఈ రోజు తెలిపారు. ఈ ప్రత్యేక బస్సులు మహాలక్ష్మి పథకంలో మహిళలు ప్రయాణించ వచ్చన్నారు.

మేడారం జాతరకు భక్తుల సౌకర్యార్థం మండల కేంద్రంలోని పిఎసిఎస్ గ్రౌండ్ లో బస్ పాయింట్ నుండి బస్సులు మేడారం గద్దెల వరకు వెళ్తాయన్నారు. బస్ టికెట్ ధర పెద్దలకు రూ. 260, పిల్లలకు రూ. 160 చెల్లించాలన్నారు. ఈ అవకాశాన్ని చిట్యాల, టేకుమట్ల, మండలాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని మేనేజర్ కోరారు. ఈ కార్యక్రమంలో, బస్సు కండక్ట ర్లు, నందకుమార్, యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply