ఓట్లు వేసి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి పాటు పడుతా

ఓట్లు వేసి గెలిపిస్తే వార్డు అభివృద్ధికి పాటు పడుతా

  • 2వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి గోమాస ప్రవీణ్

బెల్లంపల్లి రూరల్, ఆంధ్రప్రభ : బెల్లంపల్లి మున్సిపాలిటీ లోని రెండో వార్డులో ప్రజల సమస్యలు విని వారు కోరుకున్న అభివృద్ధి చేసేందుకు ప్రజల వద్ద కు వచ్చానని 2వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గోమాస ప్రవీణ్ అన్నారు. గురువారం మున్సిపల్ ఎన్నికల ప్రచారం లో బాగాంగా వార్డు లో కాంగ్రెస్ కార్యకర్తలు కలిసి ఇంటింటా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.వార్డు లో అన్ని వీధుల్లో వీధిలైట్లు ఏర్పాటు చేయడంతో పాటు కొత్త బస్టాండ్ ఇందిరమ్మ కాలనీలో రోడ్లు నిర్మించేందుకు ఎమ్మెల్యే గడ్డం వినోద్ సహకారంతోనిధులు తీసుకువచ్చి అభివృద్ధి చేస్తానన్నారు. ప్రజలు ఆశీర్వదించి అత్యధిక ఓట్లు వేసి గెలిపించాలని ఆయన పిలుపునిచ్చారు. మీ ఓటు నామీద నమ్మకం కాదు వార్డు అభివృద్ధి పై పెట్టాలని సూసించారు.ఎన్నికలప్రచారం లో పలువురు కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు

Leave a Reply