చేతి గుర్తుకే ఓటేస్తాం.. రజని ని భారీ మెజారితో గెలిపిస్తాం

చేతి గుర్తుకే ఓటేస్తాం.. రజని ని భారీ మెజారితో గెలిపిస్తాం

29వ వార్డులో కాంగ్రెస్ గెలుపు పక్కా

పెద్దపల్లి రూరల్, ఆంధ్రప్రభ : చేతి గుర్తుకే ఓటేసి ఇల్లందుల రజనీక కృష్ణమూర్తిని భారీ మెజారిటీతో గెలిపిస్తామని 29వ వార్డు ప్రజలు శపధం చేస్తున్నారు. సోమవారం 29వ వార్డులో గడపగడపకు ప్రచారం నిర్వహించి బ్యాలెట్ నమూనా అందజేశారు. ఈ సందర్భంగా వార్డు ఓటర్లు రజని కృష్ణమూర్తి కి బ్రహ్మరథం పట్టారు. అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి రజిని మాట్లాడుతూ పదేళ్లుగా అధికారంలో ఉండి ఎలాంటి అవినీతి కి పాల్పడలేదని, వార్డు ప్రజల నుండి నాయా పైసా కూడా తీసుకోలేదని ధైర్యంగా చెబుతున్నామన్నారు. ప్రతిపక్షాల నాయకులను నమ్మితే ఐదేళ్లపాటు గోస పడతారన్నారు.

మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే 24 గంటలపాటు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. అధికార పార్టీకి ఓటు వేస్తేనే వార్డు అభివృద్ధికి ప్రభుత్వం నుండి నిధులు వస్తాయన్నారు. పెద్దపల్లి ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో 29వ వార్డుకు అత్యధిక నిధులు తీసుకువచ్చి మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామన్నారు. ప్రచారంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలతో పాటు పెద్ద సంఖ్యలో ఆర్యవైశ్య సంఘ నాయకులు పాల్గొన్నారు. ప్రచార సరళి చూస్తుంటే 29వ వార్డు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లినట్లేనని ఇల్లందుల రజనీర్ కృష్ణమూర్తి భారీ మెజారిటీతో గెలవడం ఖాయం అనిపిస్తుంది.

Leave a Reply