లొంగిపోయినవారిపై రూ.25.50లక్షలు రివార్డు
చర్ల, ఆంధ్రప్రభ : ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) రాష్ట్రం దంతేవాడ, నారాయణపూర్ జిల్లాల్లో 29 మంది మావోయిస్టులు పోలీస్ అధికారుల ఎదుట లొంగిపోయారు. ఈ మేరకు దంతెవాడ జిల్లా ఏ ఎస్ పి ఉదిత్ పుష్కల్, నారాయణపూర్ (Narayanpur) జిల్లా ఎస్పీ రాబిన్ సన్ గుడియా తెలిపారు. దంతవాడ (Dantewada) జిల్లా ఏఎస్పీ ఉదిత్ పుష్కల్ తెలిపిన వివరాల మేరకు రూ.25 లక్షల 50 వేలు రివార్డు కలిగిన 13 మంది నాయకులతో సహా 21 మంది మావోయిస్టులు పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు తెలిపారు. లొంగిపోయిన మావోయిస్టులలో అనేకమంది పలుచోట్ల జరిగిన ఎన్ కౌంటర్లలో పాల్గొన్నట్లు తెలిపారు. నారాయణపూర్ (Narayanpur) జిల్లాలో 30 లక్షలు రూపాయల రివార్డు కలిగిన ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఎనిమిది మంది లొంగిపోయినట్లు జిల్లా ఎస్పీ రాబిన్ సన్ గుడియా తెలిపారు.