28thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

28thMarchCartoon | ఆంధ్రప్రభలో నేటి కార్టూన్ ఔరా

28thMarchCartoon | ట్రంప్ విరామం వెనుక నిజమైన లక్ష్యం
హర్మూజ్ పై ప్రపంచ మద్దతు ప్రయత్నాలు
యుద్ధానికి మళ్లీ సిద్ధమవుతున్న అమెరికా
కార్టూన్‌లో ట్రంప్ ఆలోచనల ప్రతిబింబం
ఔరా కార్టూన్ ప్రత్యేకత

28thMarchCartoon
28thMarchCartoon

ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : ఇరాన్ తో యుద్ధానికి ట్రంప్ ప్రకటించిన విరామం కాస్తా 5 రోజుల నుండి పదిరోజులకు పెరిగింది. ఒకపక్క చర్చలు జరుగుతున్నాయంటూనే యుద్ధానికి మళ్ళీ సిద్ధమవుతున్నట్టు స్పష్టంగా తెలుస్తూనే ఉంది. తన ఆయుధ సంపత్తిని పునరుత్తేజం చేసుకోవడం కోసం, యుద్ధవిరామం ప్రకటనను తన శాంతికాముకత్వంగా చూపించి, హర్మూజ్ పట్ల ప్రపంచ దేశాల ప్రపంచ దేశాల మద్ధతు కూడగట్టుకోవడానికే ట్రంప్ ఈ దురాలోచన అని అందరికీ తెలుసు. అందుకే విరామం ప్రకటించిన మరునాడే మనదేశ ప్రధానికి కూడా కాల్ చేసి పదే పదే హర్మూజ్ గురించి మాట్లాడారు.

ఇప్పుడు కూడా ఈ విరామ సమయంలో విరామం తర్వాత యుద్ధ వ్యూహాలను వేగంగా సిద్ధం చేసుకుంటున్నట్లు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఇది యూ టర్న్ కాదు, శాంతికాముకత్వం అసలే కాదు. ట్రంప్ కి కావలసింది నోబెల్ “శాంతి బహుమతి” మాత్రమే కానీ, ప్రపంచ శాంతి మాత్రం అస్సలు కానేకాదు. పొట్టేలు దాడి చేసేముందు కాస వెనక్కి నడిచి వేగంగా వచ్చి ప్రత్యర్థిని ఢీకొట్టినట్టుగా ఉంది ట్రంప్ ఆలోచన.

ఇదే ఆలోచనను, ట్రంప్ అంతరంగాన్ని ఆవిష్కరించిన కార్టూన్ ఇది. అతడి ఆలోచనను హెయిర్ స్టయిల్ లో చూపించారు కార్టూనిస్ట్.

ఇది ఆంధ్రప్రభ కార్టూన్
గత రెండు దశాబ్దాలుగా ఆంధ్రప్రభ పాఠకులను, కార్టూన్ ఇష్టులను అలరిస్తోన్న కార్టూన్ ఫీచర్ ఔరా.

Leave a Reply