24March | పెట్టుబడిదారులకు షాక్.. ఎంతంటే..?

24March | పెట్టుబడిదారులకు షాక్.. ఎంతంటే..?

24thMarch | మార్కెట్ ఓపెనింగ్ నుంచే ధరల పతనం
అంతర్జాతీయ ప్రభావాలు – డాలర్ బలపడటం కారణం
వెండి ధరల్లో భారీ క్షీణత
ముందు రోజుల్లో ధరల దిశపై అనిశ్చితి

24March | ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : 24 మార్చ్ 2026 నాటికి భారత్‌లో బంగారం, వెండి ధరలు మరోసారి కొంతమేర తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా హెచ్చుతగ్గులు చూపుతున్న వెండి-బంగారం ధరలు 24మార్చ్ మంగళవారం నాడు మాత్రం మార్కెట్ ఓపెనింగ్ నుంచే సడన్‌గా పడిపోవడం పెట్టుబడిదారులను ఆశ్చర్యానికి గురిచేసింది.

భారత్ మార్కెట్‌లో ఎంసీఎక్స్ బంగారం ధర సుమారు ₹1.37 లక్షల వద్ద (10 గ్రాములు) ట్రేడ్ అవుతుండగా, వెండి ధర కిలోకు భారీగా తగ్గి ₹7,000కు పైగా పడిపోయినట్లు నివేదికలు చెబుతున్నాయి. కొన్ని నివేదికల ప్రకారం, ఒకే రోజు వెండి ధరలో ₹9,000 వరకు భారీ పతనం నమోదైందని తెలుస్తోంది.

24March

ఇక అకస్మాత్తుగా ధరలు పడిపోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ పరిణామాలే. ముఖ్యంగా అమెరికా డాలర్ బలపడటం, వడ్డీ రేట్ల తగ్గింపుపై ఆశలు తగ్గిపోవడం కూడా బంగారం ధరలపై తీవ్ర ఒత్తిడి తేవడానికి ప్రధాన కారణమైంది. సాధారణంగా అంతర్జాతీయ యుద్ధాలు, ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న పరిస్థితులలో బంగారం పై పెట్టుబడి అనేది “సేఫ్ హేవెన్”గా పెరుగుతుంది. అయితే ఈసారి పరిస్థితి మాత్రం కొంచెం భిన్నంగా మారినట్లుగానే కనిపిస్తోంది. అమెరికా-ఇరాన్ ల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, పెట్టుబడిదారులు మాత్రం బంగారం కంటే డాలర్ వైపు మొగ్గు చూపడం వల్ల బంగారం ధరలు పడిపోయాయి.

మరో వైపు, ఇటీవల కొంత తగ్గిన పశ్చిమాసియా ఉద్రిక్తతలు కూడా ధరలపై ప్రభావం చూపాయి. యుద్ధం మరింత విస్తరించకపోవచ్చన్న సంకేతాలు రావడంతో, బంగారం మీద ఉన్న డిమాండ్ తాత్కాలికంగా తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. యుద్ధం తీవ్రరూపం దాల్చితే బంగారం ధరలు పెరగొచ్చు, లేదా భవిష్యత్తులో బంగారమే దొరకకపోవచ్చన్న భయం కూడా పెట్టుబడిదారుల్లో కనిపిస్తోంది.

24March

అయితే నిన్న 23మార్చ్ సోమవారం నాడు ట్రంప్ యుద్ధానికి బ్రేక్ చెప్పడంతో, ప్రస్తుతానికి బంగారం ధరలకు కళ్ళెం పడినట్లే అని పెట్టుబడిదారులు ఊపిరి పీల్చుకోవడం, ఈరోజు కాకపోయినా, రేపైనా కొనొచ్చులే అని రిలాక్స్ అవడం కూడా ధరలపై ప్రభావం చూపినట్లు భావిస్తున్నారు.

ఇక వెండి విషయానికి వస్తే, దీని వినియోగం కేవలం ఆభరణాలకే పరిమితం కాదు. ఇది పరిశ్రమలతో నేరుగా అనుసంధానమై ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ మందగించడం, అలాగే గతంలో భారీగా పెరిగిన ధరల తర్వాత ప్రాఫిట్ బుకింగ్ జరగడం వల్ల వెండి ధరలు కుప్పకూలిన స్థాయికి చేరాయి.

24March

ఇక ముందు పరిస్థితిపై మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, బంగారం-వెండి ధరలు ఎప్పటికప్పుడు అస్థిరంగా కొనసాగే అవకాశాలు ఎక్కువ. డాలర్ బలహీనపడితే లేదా యుద్ధ ఉద్రిక్తతలు మళ్లీ పెరిగితే ధరలు ఒక్కసారిగా ఎగబాకే అవకాశం ఉంది. కానీ ప్రస్తుతం మాత్రం ప్రపంచ ఆర్థిక పరిస్థితులు, వడ్డీ రేట్లు, ప్రపంచ రాజకీయ పరిణామాల ప్రభావంతో ధరలు స్వింగ్ మోడ్‌లోనే ఉండే సూచనలు కనిపిస్తున్నాయి.

మొత్తంగా చూస్తే… ఇది కొనుగోలు దారులకు ఒక రకంగా మంచి అవకాశం అనే చెప్పవచ్చు. పెట్టుబడిదారులకు మాత్రం జాగ్రత్తగా వ్యవహరించాల్సిన కీలక సమయంగా చెప్పవచ్చు. మార్కెట్ ఎటు మళ్లుతుందో చెప్పలేని పరిస్థితిలో, ప్రతి చిన్న అంతర్జాతీయ పరిణామం కూడా బంగారం, వెండి ధరలను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నదనే విషయం స్పష్టంగా కనిపిస్తోంది.

Leave a Reply