24 carat gold price | ఎందుకు మారుతున్నాయి ధరలు?

24 carat gold price 2026 జనవరి 16 నాటి బంగారం ధరలు
బంగారం ధరల హెచ్చుతగ్గులకు కారణాలు
దుబాయితో పోలిస్తే భారత్‌లో అధిక ధరలు
ఈ రోజు బంగారం ధర ఎందుకు మారుతోంది?
పెట్టుబడిగా బంగారం కొనాలనుకునేవారి దృష్టికోణం
24 carat gold price ఆంధ్రప్రభ వెబ్ డెస్క్ : 2026 జనవరి 16 నాటికి భారతదేశంలో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 1,43,420/- ఉంది. 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.1,31,468/-
భారతదేశంలో బంగారం ధరల హెచ్చు తగ్గులకు ప్రధాన కారణాలు ప్రధానంగా అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ ధరలు, అమెరికన్ డాలర్ లో మార్పులు, విదేశాల నుండి భారత్ కు బంగారం దిగుమతులపై విధించే కస్టమ్స్ డ్యూటీలు వంటి అంశాలపై ఆధారపడి ఉంటాయి.
24 carat gold price దుబాయితో పోలిస్తే భారత్‌లో అధిక ధరలు

దుబాయితో పోలిస్తే భారత దేశంలో బంగారం ధరలు ఇప్పటికీ ఎక్కువ గానే కొనసాగుతున్నాయని విశ్లేషకులంటున్నారు.. అందుకు ఇదే ఉదాహరణ.
2026 జనవరి 16న భారత్‌లో 24 క్యారెట్ల బంగారం ధర: ₹1,43,420 (10 గ్రాములు)
దుబాయిలో 24 క్యారెట్ల బంగారం ధర: ₹1,12,816 (10 గ్రాములు)
కచ్చితంగా చెప్పాలంటే రెండు దేశాల మధ్య ధరల వ్యత్యాసం రూ.30,604/- అంటే సుమారు 27.13 శాతంగా ఉంది. ఇదే విధంగా, 22 క్యారెట్ల, 18 క్యారెట్ల బంగారం ధరలు కూడా దుబాయితో పోలిస్తే భారత్‌లో సుమారు 27.13 శాతం అధికంగానే ఉంటున్నాయి.ఫీజులు, పన్నులు, డ్యూటీలు పరిగణనలోకి తీసుకోకుండా.
24 carat gold price ఈ రోజు బంగారం ధర ఎందుకు మారుతోందంటే…
డాలర్ బలపడటం, సేఫ్-హేవెన్ డిమాండ్ తగ్గడం కారణంగా పెద్దగా మార్పులు లేకుండా సైడ్ వేస్ ట్రెండ్‌లో కొనసాగాయి. గత సెషన్‌లో డాలర్ ఇండెక్స్ లాభాలు నమోదు చేయడంతో, బంగారం ధరలు కొంత మేర తగ్గాయి. బలమైన డాలర్ కారణంగా బంగారం వంటి విలువైన లోహాలు ఇతర కరెన్సీ వినియోగదారులకు ఖరీదైనవిగా మారుతూంటాయి..
ఈ కారణాలే కాక, ఇరాన్‌పై సైనిక చర్యలు ఆలస్యం కావొచ్చని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన వ్యాఖ్యలు బంగారం సేఫ్-హేవెన్ ఆకర్షణను కొంత తగ్గించాయి. దీని వల్ల ధరలు స్వల్పంగా దిగువకు వచ్చాయి.
అలాగే, రాబోయే సమావేశంలో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందనే అంచనాలు తగ్గడం కూడా బంగారం ధరలపై ప్రభావం చూపింది. ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్‌ను తొలగించే ఆలోచన లేదని ట్రంప్ స్పష్టం చేయడం కూడా మార్కెట్లను ప్రభావితం చేసింది.
పెట్టుబడిగా బంగారం కొనాలనుకునేవారి దృష్టికోణం
సమీప కాలంలో పెట్టుబడిదారులు లాభాల స్వీకరణ చేయడం వల్ల బంగారం ధరలు ఒక నిర్దిష్ట పరిధిలో మాత్రమే కదలాడే అవకాశముందని విశ్లేషకుల అంచనా. బలమైన డాలర్ ఇండెక్స్, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొంత మేర తగ్గడం కూడా ధరలు స్థిర పడటానికి కారణం.
అయితే, దీర్ఘకాలికంగా చూసుకున్నట్టయితే బంగారానికి భవిష్యత్ ఇంకా బలంగానే ఉందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో ఫెడరల్ రిజర్వ్ మరిన్ని వడ్డీ రేట్ల తగ్గింపులు చేపట్టవచ్చన్న అంచనాలు, అలాగే కేంద్ర బ్యాంకుల స్థిరమైన కొనుగోళ్లు, అమెరికా–వెనిజువెలా సంక్షోభంపై అనిశ్చితి కొనసాగడం వల్ల బంగారం సేఫ్-హేవెన్ ఆకర్షణ కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
(ఈ వ్యాసం పాఠకుల ప్రాథమిక అవగాహన కోసం అందించబడుతోన్న సమాచారం మాత్రమే. వాస్తవ మార్కెట్లో కొంత హెచ్చు తగ్గులు ఉండొచ్చు)
click here to read Market | సంక్రాంతి రోజూ పెరిగిన బంగారం, వెండి ధరలు | హైదరాబాద్‌లో నేటి గోల్డ్ రేట్స్
gold rate today
gold price today india
24 carat gold price
22 carat gold price
gold rate january 16 2026
silver price today
gold price comparison india dubai
gold investment news
bullion market india
gold price analysis
