21k | వెండి ధరల వేగానికి కొద్దిగా బ్రేక్

21k | వెండి ధరల వేగానికి కొద్దిగా బ్రేక్
21k | ముంబై: వెండి ధరలు ఊహించని విధంగా పెరుగుతున్న వెండి ధరల వేగానికి కొద్దిగా బ్రేక్ పడింది. సోమవారం నాడు మల్టీ కమొడిటీ ఎక్స్చేంజ్ (ఎంసీఎక్స్)లో మార్చి నెలకు సిల్వర్ ఫ్యూచర్స్ ఇంట్రాడేలో ఆల్ టైమ్ రికార్డ్ స్థాయికి చేరి 2,54,174 రూపాయల వద్ద గరిష్టాన్ని తాకింది. గంటలోనే 21 వేల రూపా యలు తగ్గి 2,33,120 రూపాయల కనిష్టాన్ని తాకింది. స్పాట్ మార్కెట్లోనూ వెండి ధర తగ్గింది. కేజీ 2.5 లక్షలకు పైగా పలికి వెండి ధర హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 2.39 లక్షలకు దిగి వచ్చింది. గత వారంలో బంగారం 3. వెండి 14 శాతం పెరిగాయి. గోల్ ఫ్యూచర్స్ రికార్డు స్థాయిలో పెరిగి ఔన్స్ ధర 4,81.30 డాలర్లకు చేరింది.
21k | ఒక్కసారిగా ధర దిగి వచ్చింది
భౌగోళిక అనిశ్చితుల కారణంగా ఇటీవల బంగారం, వెండికి భారీగా డిమాండ్ పెరిగింది. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ ధర 50 డాలర్ల లోపుగానే ట్రేడవుతూ వచ్చిన వెండి ఒక్కసారిగా దూసుకుపోయింది. దీంతో సోమవారం నాడు ఒక దశలో 83 డాలర్లకు చేరింది. గరిష్టాల వద్ద ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణతో ఒక్కసారిగా ధర దిగి వచ్చింది. రష్యా-ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం విషయంలో ముందగుడు పడింది.

అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశమైన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సమావేశ మయ్యారు. శాంతి ఒప్పందం కుదుర్చుకునేం దుకు పుతిన్, జెలెన్స్కీ ఇద్దరూ సుముఖంగా ఉన్నారని ట్రంప్ ప్రకటించారు. దీని ప్రభావం మార్కెట్లపై పడింది. దీంతో వెండి ధరలు తగ్గా యి. వెండి ధర ఈ సంవత్సరం ఇప్పటి వరకు 192 శాతం పెరిగింది. బంగారం ధరలు 73 శాతం పెరిగాయి. ఇటీవల వెండి ధరలు భారీగా పెరగడంతో దీని మార్కెట్ సంపద విలువ 4.22 లక్షల కోట్ల డాలర్లకు చేరింది. ఇది యాపిల్, అల్ఫాబెట్ సంస్థల మార్కెట్ విలువను అధిగ మించింది. నివిడియా మార్కెట్ విలువ కంటే కేవలం 8.1 శాతం మాత్రమే తక్కువగా ఉంది.
నివిడియా మార్కెట్ సంపద విలువ 4.592 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది. బంగారం మార్కెట్ సంపద విలువ 31.598 లక్షల కోట్ల డాలర్లుగా ఉంది.
జనవరిలో మరోసారి అమెరికా వడ్డీ రేట్లు తగ్గించవచ్చన్న అంచనాలతో డిసెంబర్లో వెండి, బంగారం రేట్లు రాకెట్ వేగంతో పెరిగాయి. అంతర్జాతీయ భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు కొనసాగడం దీనికి మరింత ఆజ్యం పోశాయి. వీటికి తోడు పారిశ్రామిక రంగంలో వెండి వాడకం పెరిగి డిమాండ్ ఏర్పడింది. వీటితో పాటు సప్లయ్ సమస్యలు కూడా వెండి ధరల పెరుగుదలకు దారి తీస్తున్నాయి. 2025 లో భారత్ 6000 టన్నుల వెండికి దిగుమతి చేసుకుంది.
click here to read Good News| Gold Rate | పసిడి ప్రియులకు శుభవార్త…
