20th Ward | బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గోపాల్ రెడ్డి

20th Ward | గజ్వేల్, ఆంధ్రప్రభ : గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీలోని 20 వార్డు బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా తాజా మాజీ కౌన్సిలర్ వంటేరు గోపాల్ రెడ్డికి టికెట్ ఖరారైంది. ఈ వార్డ్ నుంచి తాజా మాజీ కౌన్సిలర్ పోటి పడ్డప్పటికీ పార్టీ అధిష్టానం వంటేరు గోపాల్ రెడ్డి కి మొగ్గుచూపి టికెట్ ఖరారు చేశారు. దీంతో 20 వార్డు నుంచి గోపాల్ రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు.
