పీ4 అమలు పై అధికారులతో సమీక్ష

పీ4 అమలు పై అధికారులతో సమీక్ష
రాప్తాడు, ఆంధ్రప్రభ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీ4-జీరో పావర్టీ కార్యక్రమం అమలు చేసి ఏడాది పూర్తి అయిందని ఎమ్మెల్యే సునీత పేర్కొన్నారు.టిడిపి క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ అధికారులతో సమీక్ష నిర్వహించారు.రాప్తాడు నియోజకవర్గం ప్రత్యేక అధికారి రామ్మోహన్ రాప్తాడు ఎంపీడీఓ విజయలక్ష్మి పాల్గొన్నారు.
ఈ సంధర్బంగా మాట్లాడుతూ స్వర్ణాంధ్ర విజన్ 2047 P4- జీరో పావర్టీ కార్యక్రమం సమర్థవంతంగా చేస్తున్నందుకు మార్చి 31న ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్గదర్శులు బంగారు కుటుంబాలు భాగస్వామ్యులు కావాలన్నారు.వాళ్ళతో పరస్పర చర్చలు నిర్వహించి ఇంకా ఎలాంటి కార్యక్రమాలు చేయాలన్నదానిపై చర్చించాల్సి ఉంటుందన్నారు. అలాగే మార్గదర్శులకు సన్మాన కార్యక్రమం కూడా ఉంటుందన్నారు.
భవిష్యత్ లో ఈ కార్యక్రమంలో మరి కొంత మంది మార్గదర్శులను భాగస్వామ్యం చేసేలా అధికారులు చొరవ చూపాలన్నారు. రాప్తాడు ఎంపీడీఓ కార్యాలయం వేదికగా ఈ కార్యక్రమం నిర్వహించాలన్నారు.
