రాయపర్తిలో 20 కిలోల గంజాయి స్వాధీనం

రాయపర్తి, ఆంధ్రప్రభ : మండల కేంద్రంలో అక్రమంగా తరలిస్తున్న 20 కిలోల ఎండు గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ ముత్యం రాజేందర్ తెలిపారు.

శనివారం ఒడిశా రాష్ట్రం నుంచి వరంగల్ మీదుగా గంజాయి అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు ముందస్తు సమాచారం అందింది. దీంతో ఎస్ఐ ముత్యం రాజేందర్ తన బృందంతో కలిసి రాయపర్తి హెచ్‌పి పెట్రోల్ బంక్ వద్ద పకడ్బందీగా నిఘా ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు.

ఈ క్రమంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక కారును తనిఖీ చేయగా అందులో 20 కిలోల ఎండు గంజాయి బయటపడింది. వెంటనే గంజాయిని స్వాధీనం చేసుకుని, గంజాయి తరలిస్తున్న ఒడిశా రాష్ట్రం మలకానగిరి జిల్లాకు చెందిన విక్రమ్, గౌతమ్, బిప్రోజిత్ అనే ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు.

వారి వద్ద ఉన్న మూడు సెల్‌ఫోన్లు, కారును కూడా పోలీసులు సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.10 లక్షలు ఉంటుందని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు చెప్పారు.

Leave a Reply