బిజెపి బ్రహ్మచారి …ప్రచారం జోరు

బిజెపి బ్రహ్మచారి …ప్రచారం జోరు
1 వ వార్డులో బిజెపి అభ్యర్థి మోత్కూర్ బ్రహ్మచారి విస్తృత ప్రచారం
మోత్కూర్, ఫిబ్రవరి 3 (ఆంధ్రప్రభ) : మోత్కూర్ మున్సిపాలిటీలో బిజెపి బ్రహ్మచారిగా ముద్రపడిన… మోత్కూర్ బ్రహ్మచారి 1 వ వార్డ్ బిజెపి అభ్యర్థిగా నిత్యం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు . మహిళా ఓటర్లతో కలిసి ఇంటింటి ప్రచారంలో విస్తృతంగా పాల్గొంటున్నారు . రిటైర్డ్ ప్రధానోపాధ్యాయునిగా ఉన్న తాను.. సామాజిక సేవలో ఉన్నానని.1 వ వార్డు ప్రజలు ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపిస్తే… ప్రజాప్రతినిధిగా కొనసాగుతూ ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా కృషి చేస్తానని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.
