19 Team World Cup | భారీ ప్రైజ్‌మనీని ప్రకటించిన బీసీసీఐ

19 Team World Cup | భారీ ప్రైజ్‌మనీని ప్రకటించిన బీసీసీఐ

19 Team World Cup | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : అండర్19 వన్డే ప్రపంచకప్‌ను ఆరోసారి టీమ్‌ఇండియా కైవసం చేసుకుంది. ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ భారీ శతకం సాధించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో జట్టుకు భారీ ప్రైజ్‌మనీని బీసీసీఐ ప్రకటించింది. రూ.7.5కోట్లను నజరానా ఇస్తున్నట్లు వెల్లడించింది. ప్రపంచకప్‌ గెలిచిన టీమ్‌ఇండియాకు ఐసీసీ నుంచి ఎలాంటి ప్రైజ్‌మనీ లేదు. యువటాలెంట్‌ను గుర్తించే టోర్నీగానే ఐసీసీ భావిస్తోంది. ఇప్పటికే ఆయా బోర్డులకు ఐసీసీ నిధులను ఇస్తుండటంతో ప్రత్యేకంగా ప్రైజ్‌మనీ అందించడంలేదు.

జగజ్జేత భారత్ కు నగదు బహుమతి ప్రకటిస్తున్న సందర్భంగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా మాట్లాడుతూ.. మా అండర్ 19 జట్టు వరల్డ్ కప్ ను గెలిచినందుకు దేశమంతా గర్విస్తోంది. ఇంగ్లండ్ పై ఫైనల్లో చూపిన ప్రదర్శన, టోర్నమెంట్ మొత్తం ఓటమి లేకుండా ఆడిన తీరు అద్భుతం. ఈ విజయానికి గుర్తుగా రూ. 7.50 కోట్ల బహుమతి అందజేస్తున్నామన్నారు.

ఆరోసారి ప్రపంచకప్ గెలిచిన భారత జట్టును ప్రధాని నరేంద్ర మోదీ కూడా అభినందించారు. భారత క్రికెట్ ప్రతిభ మరోసారి వెలుగొందింది. అండర్ 19 జట్టు వరల్డ్ కప్ ను గెలిచి దేశానికి గర్వకారణమైంది. ఈ విజయం అనేక యువ క్రీడాకారులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు.

19 Team World Cup

Leave a Reply