18వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి తస్లీమ్ సుల్తానా ప్రచార ప్రభంజనం

భారీ మెజార్టీతో గెలిపించాలని విన్నపం
బెల్లంపల్లి, ఫిబ్రవరి 6 (ఆంధ్రప్రభ): మున్సిపల్ ఎన్నికల వేళ బెల్లంపల్లి 18వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తస్లీమ్ సుల్తానా ప్రచారం అత్యంత ఉత్సాహంగా సాగుతోంది. శుక్రవారం వార్డులోని పలు కాలనీల్లో ఆమె కాంగ్రెస్ పార్టీ లీడర్లు, కార్యకర్తలతో కలిసి ప్రచార ర్యాలీ నిర్వహించారు. గడప గడపకూ వెళ్లి ఓటర్లను కలుస్తూ, హస్తం గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె అభ్యర్థించారు. ఈ సందర్భంగా వార్డు ప్రజలు ఆమెకు ఘనస్వాగతం పలికారు.ప్రచారంలో భాగంగా తస్లీమ్ సుల్తానా మాట్లాడుతూ, ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారి నాయకత్వంలో బెల్లంపల్లి పట్టణం అభివృద్ధి పథంలో దూసుకుపోతోందని, 18వ వార్డును కూడా అదే స్థాయిలో తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వార్డులో నెలకొన్న డ్రైనేజీ, సిసి రోడ్లు మరియు మంచినీటి సమస్యల పరిష్కారమే తన ప్రథమ ప్రాధాన్యత అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ప్రతి పేదవాడికి చేరువయ్యేలా కృషి చేస్తానని ఓటర్లకు భరోసా ఇచ్చారు. ఈ ప్రచార కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు పోచంపల్లి హరీష్, సీనియర్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు పోచంపల్లి యశోద, కాపురపు కిరణ్, సజ్జు మరియు పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొన్నారు. తస్లీమ్ సుల్తానాకు లభిస్తున్న ఆదరణ చూస్తుంటే 18వ వార్డులో కాంగ్రెస్ విజయం ఖాయమని నాయకులు ధీమా వ్యక్తం చేశారు.
