సమావేశంలో మాట్లాడుతున్న 18 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరావు

సమావేశంలో మాట్లాడుతున్న 18 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరావు

మద్యం వ్యాపారిని చిత్తుగా ఓడించండి
18 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరావు

జనగామ, ఫిబ్రవరి 9 ( ఆంధ్రప్రభ ) : ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న మద్యం వ్యాపారం చేస్తున్న బిఆర్ఎస్ అభ్యర్థి ని ఈ ఎన్నికల్లో చిత్తుగా ఓడించాలని 18 వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి శ్రీనివాసరావు ప్రజలను కోరారు.సోమవారం మున్సిపల్ 18 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొండ శ్రీనివాస్ రావు విస్తృత ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మద్యం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, అనారోగ్య సమస్యలతో ఆర్థికంగా చితికి పోతున్నారని ఇలాంటి వాటికి కారణమైన మద్యం వ్యాపారి బిఆర్ఎస్ అభ్యర్థి ని 18 వ వార్డులో చిత్తుగా ఓడించి నీతి నిజాయితీ గల కాంగ్రెస్ అభ్యర్థి నీ గెలిపించాలని ఆయన కోరారు. పదేళ్ల పాలనలో బిఆర్ఎస్ పార్టీ జనగామ మున్సిపాలిటీ దోచి పెట్టుకున్నదని, మళ్లీ అధికారం ఇస్తే ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడతాయని ఆయన అన్నారు .కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా పాలనలో అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని ఆయన తెలిపారు .

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నందున మున్సిపాలిటీ కూడా పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయని, ప్రజలు ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులకే పట్టం కట్టాలని ఆయన కోరారు. గత కొన్ని దశాబ్దాలుగా జర్నలిజం లో పనిచేస్తూ సమస్యలపై పూర్తి అవగాహన ఉందని ,వాటి పరిష్కారం కూడా తనకు తెలుసునని ఆయన తెలిపారు.ఎందరో నేతలు, నీతులు బోధించుకుంటూ వస్తున్నారు, పోతున్నారు కానీ 18 వ వార్డు మాత్రం అభివృద్ధి ఎరుగని అనాథ గానే మిగిలిపోతున్నది అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇకనైనా వార్డు అభివృద్ధి చేసి, సబ్బండ వర్గాల వారిని నొప్పింపక, మెప్పించే విధంగా 18 వ వార్డు అభివృద్ధికై పరితపించే మీ కొండ శ్రీనివాస్ రావు అభిమాన నాయకుడు కాదు సేవకుడు అని మీ అమూల్యమైన ఓటు వేసి, అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎన్నికల ఇన్చార్జి మూసాపేట రవీందర్ రెడ్డి, కాంగ్రెస్ వార్డు అధ్యక్షులు డి. అంజిరెడ్డి , నాయకులు సూర్య ప్రకాష్ ,కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply