186 couples | వైభవంగా చండీ హోమం..

186 couples | వైభవంగా చండీ హోమం..

అమావాస్య వేళ ఆధ్యాత్మిక శోభ…
ఇంద్రకీలాద్రి నూతన యాగశాలలో..
విశేష సంఖ్యలో పాల్గొన్న భక్తులు..
ఏర్పాట్లు సౌకర్యాలపై భక్తుల ప్రశంసలు

186 couples | ఇంద్రకీలాద్రి, ఆంధ్రప్రభ : కనకదుర్గమ్మ కొలువై ఉన్న విజయవాడ లోని ఇంద్రకీలాద్రిపై ఆధ్యాత్మిక సందడి నెలకొంది. అమావాస్య పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం ఆలయంలో నిర్వహించిన చండీ హోమం భక్తజన సందోహం మధ్య అత్యంత వైభవంగా జరిగింది. ముఖ్యంగా ఇటీవల అందుబాటులోకి వచ్చిన నూతన యాగశాల భక్తుల పాలిట వరప్రదాయినిగా మారింది. అత్యాధునిక హంగులు, సంప్రదాయబద్ధమైన కట్టడంతో భక్తులందరూ ఎంతో ప్రశాంతంగా పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

సౌకర్యవంతంగా 372 మందితో హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. బుధవారం అమావాస్య కావడంతో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చండీ హోమంలో దాదాపు 186 జంటలు (మొత్తం 372 మంది భక్తులు) పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. గతంలో రద్దీ సమయంలో భక్తులు ఇబ్బంది పడేవారు, కానీ నూతన యాగశాల విశాలంగా ఉండటంతో ఇంతమంది ఒకేసారి పాల్గొన్నా ఎక్కడా అసౌకర్యం కలగలేదు.

186 couples |

186 couples | నూతన యాగశాల ప్రత్యేకతలు..

ఇంద్రకీలాద్రిపై హోమాలు ప్రత్యేక పూజలు కోసం నూతనంగా నిర్మించిన యాగశాల ఎంతో ఎత్తుగా, గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా నిర్మించడంతో హోమ ధూమం వల్ల భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేశారు. హోమ గుండాల వద్ద భక్తులు కూర్చోవడానికి కేటాయించిన స్థలం, పూజా సామాగ్రి పంపిణీ పద్ధతి అత్యంత వ్యవస్థీకృతంగా ఉందని భక్తులు సంతోషం వ్యక్తం చేశారు.

186 couples |

సంప్రదాయ శిల్ప కళతో పాటు, ఆధునిక వసతులు కల్పించడం వల్ల ఇంద్రకీలాద్రి వైభవం మరింత పెరిగిందని పలువురు భక్తులు కొనియాడారు. ఒకేసారి వందలాది మంది భక్తులు ఎటువంటి తోపులాటలు లేకుండా, ప్రశాంతమైన వాతావరణంలో హోమ క్రతువులో పాల్గొనడం నూతన యాగశాల నిర్మాణ లక్ష్యాన్ని నెరవేర్చిందని ఆలయ అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

186 couples |
186 couples |

click here to read more : 100 percent |దివ్యాంగులకు ఉగాది కానుక ‘దివ్యాంగ శక్తి…

click here to read more

Leave a Reply